ముహుర్తం ఫిక్స్.. ఈనెల 27న వైసీపీలోకి దగ్గుబాటి

Published : Feb 26, 2019, 10:42 AM IST
ముహుర్తం ఫిక్స్.. ఈనెల 27న వైసీపీలోకి దగ్గుబాటి

సారాంశం

దగ్గుబాటి ఫ్యామిలీ.. వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 27న తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు

దగ్గుబాటి ఫ్యామిలీ.. వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 27న తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు.

తనతోపాటు తన తనయుడు హితేష్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా అదే రోజు వైసీపీలో చేరతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం రాత్రి మార్టూరు, యద్దనపూడి మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో దగ్గుబాటి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో మార్టూరు, పర్చూరు శాసన సభ్యులుగా 5 సార్లు విజయం సాధించానన్నారు. జగన్ మాట తప్పే మనిషి కాదని ఈ సందర్భంగా దగ్గుబాటి పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ని సీఎం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. అనంతరం హితేష్ మాట్లాడుతూ.. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చానన్నారు

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్