
పశ్చిమ గోదావరి (west godavari) జిల్లా బుట్టాయి గూడెంలో (buttaigudem ) భారీగా నకిలీ కరెన్సీ బయటపడింది. జంగ్గారెడ్డి గూడెం (jangareddygudem), పోలవరం ప్రాంతాల్లో (polavaram ) దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 12 లక్షల నకిలీ కరెన్సీ, 3 బైకులు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నకిలీ కరెన్సీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు రాహుల్ దేవ్ శర్మ.
కాగా.. ఈ నెల ప్రారంభంలో కర్నూల్ జిల్లా శ్రీశైలంలో దొంగనోట్ల చలామణి కలకలం రేపింది. పెట్రోల్ బంక్ సిబ్బందికి దొంగనోట్లు ఇచ్చి పెట్రోల్ పోయించుకొన్నారు యాత్రికులు. ఈ విషయాన్ని గుర్తించి పెట్రోల్ బంక్ సిబ్బంది యాత్రికులను పట్టుకొని నిలదీశారు. దీంతో నకిలీ నోట్లను చించి అసలు నోట్లను ఇచ్చి వెళ్లిపోయారు piligrims.
ALso Read:ఎటిఎంలో నకిలీ నోట్ వచ్చిందా? అయితే వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి..
srisailam ఓ పెట్రోల్ బంక్ లో కారులో వచ్చిన యాత్రికులు నకిలీ కరెన్సీ ని ఇచ్చి పెట్రోల్ పోయించుకొన్నారు. అయితే కారులో వచ్చిన యాత్రికులు ఇచ్చిన fake currency గుర్తించారు petrol bunk సిబ్బంది. వెంటనే యాత్రికుల కారును పెట్రోల్ బంకు సిబ్బంది వెంబడించి పట్టుకొన్నారు. యాత్రికులను నకిలీ కరెన్సీ విషయమై నిలదీశారు. దీంతో యాత్రికులు నకిలీ కరెన్సీని చించి అసలు కరెన్సీని పెట్రోల్ బంక్ సిబ్బందికి అందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నకిలీ కరెన్సీ యాత్రికులకు ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై ప్రస్తుతం చర్చకు తారి తీసింది. ఈ విషయమై పోలీసులు దృష్టి సారించారు. పెట్రోల్ బంక్ సిబ్బందికి నకిలీ కరెన్సీని ఇచ్చిన వారెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.