ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.నేరస్తుడి చేతిలో అధికారం ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. రాజకీయాల్లో నేరస్తులు రాకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
విశాఖపట్టణం: నేరస్తుడి చేతిలో అధికారంలో ఉంటే ఇలానే ఉంటుందని రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై జనసేనచీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.విశాఖ పోలీసులు జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆదివారం నాడు నోటీసులు అందించారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.తాను విశాఖపట్టణానికి రాకముందే గొడవ జరిగిందన్నారు. కానీ తాము రెచ్చగొట్టడంవల్లే గొడవ జరిగిందని పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇచ్చారన్నారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు జనసేన సిద్దంగా ఉందన్నారు..ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు వెళ్లేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. గొంతెతొద్దు, ప్రశ్నించొద్దంటే ఎలా అని ఆయన అడిగారు. అడిగేవాళ్లు లేరని ఇష్టానుసారం చేస్తున్నారని జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బలహీనుల విషయంలో పోలీస్ శాఖ బలంగా పనిచేస్తుందన్నారు. ఎదురు దాడి చేసేవారి విషయంలో చాలా బలహీనంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు.
undefined
ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని డ్రోన్లను నిషేధించారన్నారు. రాజకీయాల్లో నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:కారణమిదీ: పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు
ప్రతి విషయాన్నికులం, మతంతో ముడిపెట్టొద్దని ఆయన వైసీపీకి హితవు పలికారు.తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ ఇప్పుడుబీఆర్ఎస్ గా పేరు మార్చుకొందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.జగన్ ప్రభుత్వంలో రాయితీలు తప్ప అభివృద్ది ఎక్కడని ఆయన ప్రశ్నించారు. అభివృద్ది గురించి ఎవరు ప్రశ్నించవద్దా అని పవన్ కళ్యాణ్ అడిగారు.పార్లమెంట్ లో వైసీపీకి 30 ఎంపీలుండి ఏం ప్రయోజనమని ఆయన అడిగారు.