Pawan Kalyan..ప్రజల కోసమే పొత్తులు: వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేయకపోవడంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Dec 1, 2023, 5:17 PM IST
Highlights

జనసేన విస్తృతస్థాయి సమావేశం  ఇవాళ మంగళగిరిలో జరిగింది.ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 


అమరావతి: తెలంగాణలో  పార్టీ  పెట్టి కూడ వైఎస్ షర్మిల పోటీ  చేయలేకపోయిందని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.శుక్రవారంనాడు  మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయలేకపోయారు.  ముఖ్యమంత్రి బిడ్డ, మరో ముఖ్యమంత్రికి సోదరిగా ఉన్న షర్మిల  తెలంగాణలో పోటీ చేయలేదన్నారు.  కానీ తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని  వైసీపీ నేతలు విమర్శించడంపై  పవన్ కళ్యాణ్ స్పందించారు.  ఎలాంటి సిద్దాంతాలు లేని పార్టీ వైసీపీ అని ఆయన మండిపడ్డారు.  తనను విమర్శించే అర్హత వైసీపీకి లేదన్నారు.ప్రజలకు ఏది అవసరమో అది చేస్తానన్నారు.   ప్రజల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామన్నారు.తన గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.తాను  ఏ పదవులు కోరుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. చేసే పని, పోరాటమే గుర్తింపు ఇస్తుందని  పవన్ కళ్యాణ్ తెలిపారు.

 తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ధైర్యం తప్ప ఏమీ లేదన్నారు.తనను,తన భావజాలాన్ని నమ్మి యువత తనతో నడుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ ఏ సిద్దాంతాల కోసం  ఏర్పడిందో ఆ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమని చెప్పిన బీజేపీ కూడ జనసేనతో కలిసి పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.పార్టీ కమిట్ మెంట్, భావజాలం,  కారణంగానే బీజేపీ మనతో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో 50 శాతం ఓటింగ్ కూడ నమోదు కాలేదన్నారు పవన్ కళ్యాణ్.యువత ఓటింగ్ కు దూరంగా ఉండడం బాధాకరమమని ఆయన  చెప్పారు.జాతీయ నేతల గుర్తింపు కోసం తాను తహతహలాడనని ఆయన  చెప్పారు.


 

click me!