ఏపీలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు.. జనం పడిగాపులు

Siva Kodati |  
Published : Dec 01, 2023, 03:40 PM IST
ఏపీలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు.. జనం పడిగాపులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈ కేవైసీలు పనిచేయకపోవడంతో ఈ ఆటంకం ఎదురైంది. ఆధార్ సేవల అంతరాయంతోనే ఈ కేవైసీలు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈ కేవైసీలు పనిచేయకపోవడంతో ఈ ఆటంకం ఎదురైంది. ఆధార్ సేవల అంతరాయంతోనే ఈ కేవైసీలు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. దీంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు జనం పడిగాపులు కాస్తున్నారు. పరిస్ధితుల నేపథ్యంలో ఇవాళ రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం లేదని అధికారులు, సిబ్బంది చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?