అంగన్ వాడీలతో చర్చలు జరపకుండా ఈడ్చేస్తారా ? ఇది అప్రజాస్వామికం - పవన్ కల్యాణ్

By Sairam Indur  |  First Published Jan 22, 2024, 3:23 PM IST

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)లోని విజయవాడ (vijaywada)లో అంగన్ వాడీల (anganwadi protest in andhra pradesh)పట్ల పోలీసులు దురుసు ప్రవర్తనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ (jana sena chief pawan kalyan) ఖండించారు. నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ సిబ్బంది పట్ల ఏపీ ప్రభుత్వం (andhra pradesh government) అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు ప్రభుత్వానికి నిరసనలు తెలుపుతున్నారు. వేతనాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. గత 42 రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ముందుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్థరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీలు చేపట్టిన నిరాహాక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

రేపటి నుంచి భక్తులకు బాల రాముడి దర్శనం.. ఏటా 50 మిలియన్లకు పైగా పర్యాటకులు వచ్చే ఛాన్స్

Latest Videos

అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అంగన్ వాడీలతో చర్చలు జరపకుండా ఈడ్చి వేయడం సరికాదని అన్నారు. ఇది అప్రజాస్వామికం అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నలభై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని అన్నారు. నామ మాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా,  విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం పాలకుల ధోరణిని ఏంటో తెలియజేస్తోందని పేర్కొన్నారు. 

ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం ప్రారంభం - శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్

సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోటి సంతకాలతో కూడిన వినతి పత్రం ఇచ్చేందుకు ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్థరాత్రి సమయంలో పోలీసులు అంగన్ వాడీ మహిళలను ఈడ్చి వేయడాన్ని తాము ఖండిస్తున్నామని జనసేన చీఫ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందిని అరెస్టులు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిని పోలీసు వాహనాల్లోకి ఎక్కించడాన్ని ఖండిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

500 ఏళ్ల నిరీక్షణకు తెర.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తి.. భావోద్వేగానికి గురైన భక్తులు

ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆ సమయంలో పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయల ఎక్కువ జీతం ఇవస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే దానిని అమలు చేయాలని అంగన్ వాడీ సిబ్బంది కోరుతున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ విధానాన్ని వర్తింపజేయాలని అంగన్ వాడీ సిబ్బంది కోరుతున్నారని చెప్పారు. చిరుద్యోగుల విషయంలో సానుకూలంగా ఆలోచించాలని పవన్ కల్యాణ్ కోరారు.

click me!