మహిళలపై దాడులపై ఉదాసీనత: జగన్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

By narsimha lode  |  First Published Sep 19, 2022, 10:25 PM IST

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  విమర్శించారు. 


విజయవాడ:రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నా కూడా ప్రభుత్వం నిమ్మను నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలపై జరిగిన  ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.ఈ మేరకు పవన్ కళ్యాణ్  సోమవారం నాడు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. 

 మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని  ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై  అత్యాచారాలు, దాడుల వంటి కేసుల్లో  ఏపీ రాష్ట్రం దేశంలో మొదటి  10  స్థానాల్లో ఉందన్నారు.  

Latest Videos

undefined

నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలను  పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నేరగాళ్లు రెచ్చిపోతున్నా కూడ  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.  మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

అచ్యుతాపురం సెజ్ లో ఉపాధి కోసం వచ్చిన మహిళపై అత్యాచారం ఘటనతో పాటు నాగార్జునసాగర్ లో ఆశా కార్యకర్తపై రేప్ ఘటనను కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో మహిళలపై ఈ రకమైన దాడులు చోటు చేసుకుంటున్నాయన్నారు. దిశా పోలీస్ స్టేషన్లు, చట్టాలు తెచ్చామని ప్రభుత్వం పైకి ప్రచారం చేసుకుంటుందన్నారు. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.  ప్రభుత్వం ప్రచార ఆర్బాటాన్ని మానుకొని నేరస్తులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ కోరారు. 

click me!