తిరుపతి నుండి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకొంది. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుతో తిరుమల ఘాట్ రోడ్డు ట్రయల్ రన్ నిర్వహించారు.
తిరుమల: తిరుపతి నుండి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తుంది.ఈ మేరకు ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్ నిర్వహించింది. ఎలక్ట్రిక్ బస్సు ఇవాళ తిరుమలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ బస్సును తయారు చేసిన నిపుణుల బృందం బస్సుతో పాటు ట్రయల్ నిర్వహించారు.
undefined
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుపై రెండో కనుమదారిలో ప్రయాణం చేశార. మలుపులు, ఎత్తైన ప్రదేశాలున్న చోట బస్సు ఎలా నడుస్తుందనే విషయాన్ని పరిశాలించారు. వారం రోజుల పాటు బస్సు పనితీరును పరిశీలించనున్నారు.
100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ మెబిలిటి , బస్సుల తయారిలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోపుగా 20 బస్సులను ప్రారంభించాలని ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ చైర్మెన్ , ఎండీ, ద్వారకా తిరుమల చెప్పారు. మిగిలిన బస్సులు డిసెంబర్ లో రానున్నాయి.
తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో ఈ బస్సులను నడపనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుమలకు 14 బస్సులను నడపనున్నారు. తిరుపతి నుండి నెల్లూరు,కడప , మదనపల్లికి ఇంటర్ సిటీ బస్సులుగా వీటిని నడపనున్నారు.
తిరుపతిలో పైలెట్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వా త మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్ బస్సులో 35 మంది ప్రయాణీకులు కూర్చొనే వెసులుబాటు ఉంది. ఆధునాతన డిస్క్ బ్రేకింగ్ సిస్టం,సీసీటీవీ కెమెరాలు, యూఎస్ బీ సాకెట్లు కూడా ఉంటాయి. ఈ బస్సు బ్యాటరీని మూడు లేదా నాలుగు గంటల్లో రీ చార్జీ చేసుకోవచ్చు.