జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు.. ‘ప్రత్యేక హోదా గురించి మేం అడుగుతాం రండీ’

By Mahesh K  |  First Published Mar 1, 2024, 4:18 PM IST

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా సాదన కోసం ఆయన ఈ రోజు సీఎం నివాసం ముట్టడికి పిలుపు ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడికి బయల్దేరగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
 


జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీణారాయణ అరెస్టయ్యారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపు ఇచ్చిన లక్ష్మీనారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం నివాసం ముట్టడికి పలువురితో ఆయన బయల్దేరారు. దీంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తరలించారు.

జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచాయని, కానీ, ఇప్పటికీ కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. ప్రత్యేక హోదా పొందడానికి అద్భుతమైన అవకాశాలు మనకు వచ్చాయని, కానీ, వాటిని సానుకూలంగా వినియోగించుకోలేకపోయామని వాపోయారు. కేంద్రం ఇప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసపుచ్చిందని అన్నారు. వాస్తవానికి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండు కూడా విఫలం అయ్యాయని పేర్కొన్నారు.

Latest Videos

తాము ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి రాలేదని, కానీ, ప్రత్యేక హోదా సాదన కోసం అందరం కలిసి పోరాడాలనే పిలుపు ఇవ్వడానికే వచ్చామని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఢిల్లీలో రైతులు ఎలా పోరాడుతున్నారో.. అదే విధంగా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రానికి ప్రయోజనకరమైన ప్రత్యేక హోదా కోసం కలిసి వెళదాం అని పిలుపు ఇస్తున్నామని తెలిపారు.

Also Read: Gruha Jyothi: నేటి నుంచి గృహజ్యోతి.. జీరో కరెంట్ బిల్లుల జారీకి సన్నద్ధత

ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నామని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జనసేన పార్టీని కూడా అడుగుతున్నామని, సీపీఐ, సీపీఎం పార్టీలు, విద్యార్థి నాయకులు తమ వెంటే ఉన్నారని వివరించారు. ప్రత్యేక హోదాను అడగడానికి సీఎంకు నోరు రాకుంటే.. అంతా కలిసి అడుగుదాం ప్రధానమంత్రిని అని చెప్పడానికే వచ్చామని చెప్పారు.

click me!