చంద్రబాబు చేతిలో సునీత పావు.. ఇన్నాళ్లకు ముసుగు తొలగింది - సజ్జల రామకృష్ణారెడ్డి

Published : Mar 01, 2024, 03:39 PM IST
చంద్రబాబు చేతిలో సునీత పావు.. ఇన్నాళ్లకు ముసుగు తొలగింది - సజ్జల రామకృష్ణారెడ్డి

సారాంశం

ఇంత కాలానికి వైఎస్ సునీత ముసుగు తొలగిపోయిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి చేతిలో ఆమె పావుగా మారారని ఆరోపించారు.


ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ సునీతపై విమర్శలు చేశారు. చంద్రబాబు చేతిలో ఆమె పావుగా మారిపోయానని, ఇన్నాళ్లు ఆమె వేసుకున్న ముసుగు నేటితో తొలగిపోయిందని ఆరోపించారు. ఇన్నాళ్లు సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడారో ఈరోజు బయటపడిందని విమర్శించారు. 

ఫేమస్ రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. నలుగురికి గాయాలు

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసు విచారణ ఎందుకు పూర్తి చేయలేదలేదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఎదురుచూస్తున్నారని అర్థమవుతోందని, టీడీపీ ఎన్డీయేలో  కలిస్తే  మంచిదే కదా అని అన్నారు. ఇప్పటికైనా  ముసుగులు అన్ని తొలగిపోతాయని విమర్శించారు.

బీజేపీ నేతలకు బ్రెయిన్ లేదు.. నేను రామ భక్తుడినే.. ఆలయాలనూ నిర్మించా - సిద్ధరామయ్య..

అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. విజన్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామని అనుకున్న స్థానాలను టీడీపీ జనసేనకు ఇచ్చిందని విమర్శించారు. కాకినాడ తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ ఓడిపోతుందని తెలిపారు.

ఓయూలో నైట్ వాచ్ మెన్ కు 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. స్ట్రీట్ లైట్ల కింద చదివి విజయం..

ప్రజలకు సేవ చేయాలంటే సీరియస్ గా రాజకీయ పార్టీని పెట్టాలని రామకృష్ణారెడ్డి సూచించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా పవన్ కల్యాణ్ ముందుకు రావడం లేదని తెలిపారు. కాపు ఓట్ల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నియమించుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పవన్ కల్యాన్ అని విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu