టెన్షన్: బోటులో పులిచింతలకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయబాను

By narsimha lodeFirst Published Jul 11, 2021, 2:06 PM IST
Highlights


జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయబాను బోటు ద్వారా పులిచింతల ప్రాజెక్టుకు చేరుకొన్నారు. రోడ్డు మార్గంలో  ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యేను తెలంగాణ పోలీసులు అడ్డుకొన్నారు.దీంతో ఆయన బోటును ఎంచుకొన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోందని ఆయన చెప్పారు. 

జగ్గయ్యపేట: ప్రకటించినట్టుగానే జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను  ఆదివారం నాడు బోటులో పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకొన్నాడు. పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లి విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రాజెక్టులో నీటిని పరిశీలిస్తానని జగయ్యపేట ఎమ్మెల్యే ఉదయబాను ప్రకటించారు.  పులిచింతల ప్రాజెక్టు సందర్భనకు బయలుదేరిన ఎమ్మెల్యే ఉదయబానును తెలంగాణ సరిహద్దుల్లోని వజినేపల్లి వద్ద కోదాడ డీఎస్పీ నేతృత్వంలో తెలంగాణ పోలీసులు అడ్డుకొన్నారు. 

నీటిపారుదల శాఖాధికారులు నుండి అనుమతి తీసుకొంటేనే ప్రాజెక్టు వద్దకు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే  వెనుదిరిగారు. అయితే బోటు ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు ఎమ్మెల్యే చేరుకొన్నారు.  పులిచింతల ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వృధాగా తెలంగాణ ప్రభుత్వం నీటిని సముద్రంలోకి విడుదల చేస్తోందని ఆయన విమర్శించారు.  రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నీటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. తిరిగి నీటిని పంపకాలపై సమీక్ష చేయాలని కోరడం సరైంది కాదన్నారు.

click me!