కర్నూల్‌ జిల్లా గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరికి గాయాలు

Published : Jul 11, 2021, 12:24 PM IST
కర్నూల్‌ జిల్లా గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరికి  గాయాలు

సారాంశం

కర్నూల్ జిల్లా మహానంది మండలం గోపవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థల వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

కర్నూల్: కర్నూల్ జిల్లాలోని మహానంది మండలం గోపవరం ఇరువర్గాల మధ్య ఆదివారం నాడుఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.స్థల వివాదం విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  ఈ ఘర్షణ సమయంలో ఓ వ్యక్తి పారతో మరో వ్యక్తి తలపై కొట్టాడు. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.   గాయపడిన వ్యక్తిని స్థానికులు  నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

స్థలం విషయంలో  ప్రాణాలు కోల్పోయేలా దాడులు చేసుకొంటున్న ఘటనలు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. స్థల వివాదం విషఁయంలో రెవిన్యూ అధికారులు సక్రమంగా వ్యవహరిస్తే వివాదాలు చోటు చేసుకొనే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్