బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి అందకుండా చేయడమే జగన్ ప్లాన్ - టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

By Asianet News  |  First Published Nov 15, 2023, 11:08 AM IST

బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి అందకుండా చేయడమే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరోపించారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.


టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం బీసీల ద్రోహి అని అన్నారు. ఈ విషయం తమ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లే అని ఆయన ఆరోపించారు.

telangana Assembly polls 2023 : స్కూళ్లకు ఎన్నికల సెలవులు.. ఎప్పటి నుంచి ? ఎన్ని రోజులంటే ?

Latest Videos

సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కులాలకు ఉన్న పరిమితులు రద్దు చేయడం వల్ల విద్య, వైద్యం, రాజకీయంతో పాటు అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. దీని వల్ల విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోతారని చెప్పారు. విద్య పరంగా కూా తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు.

తమిళనాడులో భారీ వర్షాలు: విద్యా సంస్థలకు సెలవు, రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్

ప్రస్తుతం ఉన్న విధానంతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఒక కులాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తుంది దీని కోసమేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేశారని, దీని వల్ల 16,800 పదవులను బీసీలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

భార్యను చంపి ఆపై ఉరివేసుకుని భర్త ఆత్మహత్య.. పిల్లలు ఏడవడంతో..

బీసీలకు పీజీ చదువులకు ఫీజు రియంబర్స్ మెంట్ రద్దు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారికి విదేశీ విద్యను దూరం చేశారని అన్నారు. కార్పొరేషన్లు నాశనం చేశారని, దీని వల్ల బీసీలు రోడ్డున పడ్డారని తెలిపారు. 74 మంది బీసీలను హత్య చేశారని ఆయన ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు భౌగోళిక పరిమితులు రద్దు చేసి మరో అన్యాయానికి పాల్పడ్డారని విమర్శించారు. ‘నా బీసీలు’ అంటూ వేదికలపై స్పీచ్ లు దీని కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. కుల గణన అని చెబుతున్నది కూడా దీని కోసమేనా అని అన్నారు. 

click me!