ప్రేమ వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Published : Nov 15, 2023, 10:12 AM IST
ప్రేమ వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

సారాంశం

ఎక్కడ కనిపిస్తే అక్కడ.. మాట్లాడడానికి ప్రయత్నించడం, ప్రేమించమంటూ వేధించడం.. వెంటపడడం చేశాడు భరత్.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులకు ఓ ఇంటర్ విద్యార్థిని బలయ్యింది. తులసి అనే ఇంటర్ విద్యార్థిని బుధవారం ఉదయం తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భరత్ అనే యువకుడు తులసిని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయం తులసి తల్లిదండ్రులకు తెలిసి..అతడికి చాలాసార్లు హెచ్చరించారు. అయినా, అతను వేధింపులు మానలేదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ.. మాట్లాడడానికి ప్రయత్నించడం, ప్రేమించమంటూ వేధించడం.. వెంటపడడం చేస్తున్నాడు. దీంతో మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డ తులసి బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu