పీఆర్సీ వివాదం.. ఉద్యోగుల కోసం సచివాలయంలో మంత్రుల ఎదురుచూపులు..

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 2:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన PRC జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు సమ్మె బాట పట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాలను (emplyee unions) చర్చలకు ఆహ్వానించింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన PRC జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు సమ్మె బాట పట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులతో కోసం.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పేర్నినాని (Perni Nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చర్చలకు హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. 

అయితే emplyee unions చర్చలకు హాజరు కాలేదు. పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూశారు. చెప్పిన సమయానికి సచివాలయం రెండో బ్లాక్‌కు చేరుకన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలు ఉద్యోగ సంఘాల రాక కోసం నిరీక్షిస్తున్నారు. అయితే.. పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు తాము చర్చలకు రాబోమని ఉద్యోగ సంఘాలు వెల్లడించినప్పటికీ.. వారు వస్తారమోనని మంత్రులు సచివాలయంలో ఎదురుచూడటం ఆసక్తికరంగా మారింది. 

ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ ఢిల్లీపర్యటనలో ఉన్నందున కమిటీలోని మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. 

పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. విజయవాడలోని రెవెన్యూ కార్యాలయంలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ దాదాపు 5 గంటల పాటు సమావేశమై చర్చలు జరిపింది. ఇక, ఈ సమావేశం జరుగుతుండగానే ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రులు..బొత్స, పేర్ని నాని పోన్‌ చేసినట్లు సమాచారం. జీవోలపై వెనక్కు తగ్గే వరకూ చర్చల ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇచ్చేందకు ఉద్యోగ సంఘాలు సిద్దమయ్యాయి.

click me!