పాదయాత్రలో సరికొత్త స్టైల్

First Published Oct 14, 2017, 7:10 AM IST
Highlights
  • పాదయాత్రలో జగన్ సరికొత్త స్టైల్ ను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
  • గతానికి భిన్నంగా ఉంటుందట స్టైల్.
  • గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడు గురించి జగన్ ఎప్పుడు మాట్లాడినా అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి అని ఆరోపిస్తూనే చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు.
  • అటువంటిది పాదయాత్రలో చంద్రబాబు గురించి ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని జగన్ నిర్ణయించుకున్నారట.

పాదయాత్రలో జగన్ సరికొత్త స్టైల్ ను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతానికి భిన్నంగా ఉంటుందట స్టైల్. గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడు గురించి జగన్ ఎప్పుడు మాట్లాడినా అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి అని ఆరోపిస్తూనే చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు.

అటువంటిది పాదయాత్రలో చంద్రబాబు గురించి ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని జగన్ నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆధరించాల్సిందిగా ప్రజలను అభ్యర్ధించటంపైనే ప్రధాన దృష్టిపెట్టాలన్నది జగన్ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్.

‘చంద్రబాబు పాలన చూసారు కాబట్టి, 2019 ఎన్నికల్లో తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలం’టూని ఓటర్లను అర్ధించనున్నారు. ఈమధ్యే జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అదే విషయాన్ని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పటం అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ పాలన నచ్చకపోతే 2024లో ప్రజలు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని కూడా మేకపాటి చెప్పిన విషయం అందరూ చూసిందే

చంద్రబాబు మీద నెగిటివ్ కామెంట్లు చేయకుండా కేవలం విధానపరమైన వైఫల్యాలు, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి మాత్రమే మాట్లాడాలని జగన్ అనుకున్నారట. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో అందరు చూసిందే. అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలే ఎన్నికలో వైసీపీకి నష్టం చేసాయనే వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో అటువంటి వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్ళకుంటే బాగుంటుందని కూడా పలువురు నేతలు జగన్ కు సూచించారట.

అంటే, జగన్ పాదయాత్ర ఎటువంటి వివాదాలకు దారితీయని విధంగా ఉండబోతుందన్నది వైసీపీ వర్గాల సమాచారం. ఒక పక్క చంద్రబాబు వైఫల్యాలపై  నిర్మాణాత్మక విమర్శలు చేస్తూనే మరో పక్క తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, 2019లో ఓట్లు వేసి ఆశీర్వదించాలని అభ్యర్ధించనున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఇక నుంచి నెగెటివ్ ప్రచారం కంటే పాజిటివ్‌ దారిలోనే ప్రజలను కన్విన్స్ చేయాలని జగన్ భావిస్తున్నారట.

అంతా బాగానే ఉందికానీ జగన్ పాదయాత్రను టిడిపి సక్రమంగా జరగనిస్తుందా అన్నదే అనుమానం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ అనుసరిస్తున్న సరికొత్త స్టైల్ తో టీడీపీకి ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. సరే, అన్నవస్తున్నాడు, నవరత్నాలు, ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలు ప్రస్తావవనకు ఎటూ ఉండనే ఉన్నాయి. కాబట్టి జగన్ పాదయాత్రతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది.

 

 

 

 

click me!