ఆళ్ల రామకృష్ణకు జగన్ షాక్..

Published : Oct 09, 2018, 10:00 AM IST
ఆళ్ల రామకృష్ణకు జగన్ షాక్..

సారాంశం

ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. 

మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణకు జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో  ఆర్కేకి సీటు ఇవ్వకుండా దూరం పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో.. ఎవరెవరికి సీటు ఇవ్వాలన్న విషయంపై జగన్ కసరత్తులు చేస్తున్నట్లు  తెలుస్తోంది. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా జగన్ షాక్ లు ఇస్తున్నారు.

వైసీపీ నేతలందరిలో మంచి పేరున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణ కి కూడా ఇదే పరిస్థితి ఎదురౌతోంది. పార్టీకి, జగన్‌కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. 

రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశంకు, సీఎం చంద్రబాబుకు తరచూ కంట్లో నలుసుగా మారి కోర్టు కేసుల ఆర్కేగా పేరుగడించారు. అయితే మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్పగా ఆయన మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదని తెలిసింది. 

కాగా అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే... కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా నీపై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్‌ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్‌ లేదని చెప్పేసినట్లు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్