సింగపూర్-ఇండిగో విమాన సర్వీసులు నడపాల్సిందే: కేంద్రానికి లేఖ రాయనున్న చంద్రబాబు

Published : Oct 08, 2018, 09:11 PM IST
సింగపూర్-ఇండిగో విమాన సర్వీసులు నడపాల్సిందే: కేంద్రానికి లేఖ రాయనున్న చంద్రబాబు

సారాంశం

 విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి ఎట్టిపరిస్థితుల్లో నడపాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విమాన సర్వీసులు నడిపేందుకు ఉన్న అడ్డంకులపై చంద్రబాబు ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు, కస్టమ్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.   

అమరావతి: విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి ఎట్టిపరిస్థితుల్లో నడపాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విమాన సర్వీసులు నడిపేందుకు ఉన్న అడ్డంకులపై చంద్రబాబు ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు, కస్టమ్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

సర్వీసు నడిపేందుకు తమకు మౌలిక వసతులు లేవని కస్టమ్స్ అధికారులతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పేచీ పెడుతున్నారు. ఈనెల 25 నుంచి ఎట్టిపరిస్థితుల్లో సింగపూర్‌కు ఇండిగో విమాన సర్వీసులు నడపాలని కస్టమ్స్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఇప్పటికే వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌ కింద రూ. 18 కోట్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా విజయవాడ-సింగపూర్ సర్వీసులకు అనుమతి ఇవ్వకుండా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కొర్రీలు పెట్టడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వివాదంపై ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభుకు లేఖ రాయాలని  చంద్రబాబు నిర్ణయించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్