వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్... వెనక్కి తీసుకున్న జగన్ తరపు లాయర్లు

Published : Feb 01, 2020, 08:15 AM IST
వ్యక్తిగత మినహాయింపు కోరుతూ పిటిషన్... వెనక్కి తీసుకున్న జగన్ తరపు లాయర్లు

సారాంశం

తన బదులు సహనిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. అయితే  సడెన్ గా ఆ పిటిషన్ ని జగన్ తరపు లాయర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం.  పిటిషన్‌లో తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్ది న్యాయవాదులు మళ్లీ పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడాన్ని జగన్ సవాల్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ తన పిటషన్ లో పేర్కొన్నారు.

Also Read వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ...

అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన బదులు సహనిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. అయితే  సడెన్ గా ఆ పిటిషన్ ని జగన్ తరపు లాయర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం.  పిటిషన్‌లో తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్ది న్యాయవాదులు మళ్లీ పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.
 
మరోవైపు అక్రమాస్తుల కేసులో విచారణ కోసం శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్‌మోహన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన హాజరుకాలేదు. జగన్ తరపు న్యాయవాది వేసిన ఆబ్సెంట్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. అనంతరం జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ కేసులో అయోధ్య రామిరెడ్డి, ఇందూ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు శామ్యూల్, మన్మోహన్, రాజగోపాల్, కృపానందం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు
Vaikunta Ekadashi: విజయవాడలో వైకుంఠ ఏకాదశి వేడుకలు | Venkateswara Swamy Temple | Asianet News Telugu