కార్యకర్తలతో గంటా భేటీ.. పార్టీ మార్పుపై చర్చ

By telugu teamFirst Published Jun 25, 2019, 12:34 PM IST
Highlights

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం తన కార్యర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారని... ఆయన త్వరలోనే బీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం తన కార్యర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారని... ఆయన త్వరలోనే బీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనేది ఆ ప్రచారం పూర్తి సారాంశం. ఈ నేపథ్యంలోనే తన మద్దతు దారులతో ఆయన భేటీ అయ్యి.. పార్టీ మారే విషయంపై స్పష్టతకు వచ్చారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

కాగా... ఈ విషయంపై గంటా మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ మీడియాలోనే ప్రసారం చేసుకుంటున్నారని.. ఆ వార్తలకు రియాక్ట్ అవ్వాల్సిన అక్కర్లేదన్నారు. ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత ఇప్పుడు చాలా సార్లు పార్టీ మారుతానంటూ కథనాలు వచ్చాయన్నారు. ఇప్పుడు కూడా కథనాలు వస్తూనే ఉన్నాయని గంటా చెప్పుకొచ్చారు. 

ఈ పుకార్లు వచ్చిన టైమ్‌లో తాను శ్రీలంక పర్యటనలో ఉన్నానని.. స్నేహితులతో కలిసి ఆటో దేవాలయంకు వెళ్లానన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఆ అవసరం తనకు లేదని గంటా ఈ సమావేశంలో కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు. అనంతరం ప్రజా వేదిక కూల్చివేతపై కూడా స్పందించారు.

చంద్రబాబు అడిగారని ప్రజా వేదిక కూల్చుతాననడం సరికాదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చడంలో తప్పులేదు కానీ.. రాష్ట్రంలో అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చిన తర్వాత దీనిని కూడా కూల్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజా ధనంతో ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు కదా అని అన్నారు. ఈ భవనం కూల్చేసి ప్రభుత్వ కార్యక్రమాలు హోటల్స్ లో ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. 
 


 

click me!