కాపు రిజర్వేషన్లు: ఐదు శాతం కోటాపై జగన్ సర్కార్ మెలిక

By narsimha lodeFirst Published Jul 31, 2019, 7:37 AM IST
Highlights

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. 

అమరావతి: కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. 

ఈ విషయమై జగన్ సర్కార్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.చంద్రబాబు తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కాపులకు కొంత చికాకు పెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వైఎస్ జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా జగన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లపై రెండు చట్టాలు తెచ్చింది. ఐదు శాతం రిజర్వేషన్లను కాపులతో పాటు ఇతర కులాలకు కేటాయించింది.

తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కాపులకు ఇబ్బంది కల్గించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొన్ని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో కేసులు ఉన్నందున తాజగా కొత్త మార్గదర్శకాలను వెల్లడించాల్సి వచ్చిందని జగన్ సర్కార్ ప్రకటించింది.

లోక్‌సభలో ఆమోదించిన 2019 వన్ థర్డ్, థర్డ్ సవరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను విభజించింది.
10 శాతం రిజర్వేషన్లను రెండు చట్టాలుగా తీసుకొచ్చింది. యాక్ట్ 14, 2019 , యాక్ట్ 15 , 2019 పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన చట్టం చేశారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, ఆర్ధికంగా వెనుకబడినవారికి కూడ ఐదుశాతం రిజర్వేషన్లను కల్పించారు. ఈ రిజర్వేషన్ల కింద కాపు సామాజిక వర్గానికి విద్యా సంస్థలు, ఉద్యోగాల నియామకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేశారు. 

గత ప్రభుత్వం 2019 యాక్ట్ 14, యాక్ట్ 15 ను చట్టం 15 నిబంధనలను 2019 మార్చి 8 నుండి అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్ధికంగా వెనుకబడినవారికి 5 శాతం రిజర్వేషన్లను కల్పించే విషయమై  కోర్టులో చాలెంజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (1), 16(2) ను ఉల్లంఘించిందని పిటిషన్ దాఖలైంది.

ఏపీ హైకోర్టులో కూడ ఇదే విషయమై పిటిషన్లను దాఖలయ్యాయి.103 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 మరియు భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యాసంస్థలలోని సూపర్‌న్యూమరీ సీట్ల ఇడబ్ల్యుఎస్ కోటాను పూరించాలని ప్రభుత్వం దీని ద్వారా నిర్ణయించిందని జీవోలో తెలిపారు.

 ఈ ఉత్తర్వులపై కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఆర్ధికంగా వెనుకబడిన వారికే కేంద్రం 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. కానీ, దీనికి విరుద్దంగా చంద్రబాబు సర్కార్ 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇచ్చిందని జగన్ తమ పార్టీకి చెందిన కాపుల ప్రజాప్రతినిధులకు చెప్పారు.

టీడీపీ తన రాజకీయ లబ్దికోసమే ఈ నిర్ణయం తీసుకొందని జగన్ విమర్శించారు.
 

click me!