ఆస్తి కేసులో పోలీసుల వేధింపులు: పీఎస్ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డ బాధితుడు

By Nagaraju penumalaFirst Published Jul 30, 2019, 9:26 PM IST
Highlights

ఇకపోతే నాగరాజుకు అతని బాబాయిల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం నెలకొంది. విషయం కాస్త పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఎస్ ఐ మురళీకృష్ణ జోక్యం చేసుకుని తనను వేధిస్తున్నాంటూ నాగరాజు ఆరోపించాడు. 

ప్రకాశం: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తనను వేధిస్తున్నారంటూ నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీస్ స్టేషన్ దగ్గర అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.

మంటల్లో కాలిపోతున్న నాగరాజును పోలీసులు నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. అనంతరం అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజుకు ఆస్పత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఇకపోతే నాగరాజుకు అతని బాబాయిల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం నెలకొంది. విషయం కాస్త పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఎస్ ఐ మురళీకృష్ణ జోక్యం చేసుకుని తనను వేధిస్తున్నాంటూ నాగరాజు ఆరోపించాడు. 

తన బాబాయ్ తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని అది చెప్పినా ఎస్ఐ పట్టించుకోకుండా తననే వేధిస్తున్నారని ఆరోపించారు. గత రెండు రోజులుగా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో  వేధింపులు తాళలేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితుడు నాగరాజు స్పష్టం చేశారు.  

click me!