పార్టీ సీనియర్ నేతపై జగన్ వేటు..?

Published : Jan 03, 2019, 10:04 AM IST
పార్టీ సీనియర్ నేతపై జగన్ వేటు..?

సారాంశం

వైసీపీలో ఓ కీలక నేతపై జగన్ వేటు వేయనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 


వైసీపీలో ఓ కీలక నేతపై జగన్ వేటు వేయనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. వైసీపీ.. మొదటి నుంచి ముస్లింలకు మద్దతుగా నిలుస్తున్న పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అలాంటి పార్టీలో ఉండి ముస్లింలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు..విజయవాడకు చెందిన కీలకనేత గౌతమ్ రెడ్డి.

దీంతో.. ఆయనపై వేటు వేసేందుకు అధిష్టానం సిద్ధమౌతోందని తెలుస్తోంది. ఇటీవల ఓ చానల్‌లో ముస్లిం మహిళల మనోభావాలను కించ పర్చే విధంగా గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది.
 
పార్టీ అధినేత జగన్‌ ఆదేశాల మేరకు ఈ అంశంపై విచారణ జరిపిన క్రమశిక్షణ సంఘం గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని వైసీపీ క్రమశిక్షణ సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆయన నుంచి సంజాయిషీ అందగానే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమవుతోంది.

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu