పవన్ సహకరించాలి: చంద్రబాబు కొత్త పల్లవి

By Nagaraju TFirst Published Jan 3, 2019, 8:23 AM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారా..?గత కొంతకాలంగా పవన్ పై యుద్ధానికి కాలుదువ్విన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పల్లవి అందుకున్నారా..?అవకాశం దొరికితే పవన్ మోదీ టీం అంటూ ఉతికి ఆరేసే చంద్రబాబు ఉన్నట్టు ఉండి ఎందుకు తన స్వరం మార్చారు..?

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారా..?గత కొంతకాలంగా పవన్ పై యుద్ధానికి కాలుదువ్విన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పల్లవి అందుకున్నారా..?అవకాశం దొరికితే పవన్ మోదీ టీం అంటూ ఉతికి ఆరేసే చంద్రబాబు ఉన్నట్టు ఉండి ఎందుకు తన స్వరం మార్చారు..?

పవన్ సహకరించాలంటూ ఆయన అభ్యర్థన వెనుక మంత్రాంగం ఏంటి..?గత కొంతకాలంగా వేదిక ఏదైనా జగన్, పవన్ లను ఏకిపారేస్తున్న చంద్రబాబు ఉన్నట్లుండి జగన్ మాత్రమే విమర్శించి పవన్ కళ్యాణ్ ను విస్మరించడంలో ఆంతర్యం ఏంటి..?

తాను పవన్ తో కలిసి పోటీ చేస్తే జగన్ కు ఏం ఇబ్బంది అన్న వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న అర్థం ఏంటి..? రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని మరోసారి నిజం చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

పవన్ కళ్యాణ్ పై దోస్తీకి చంద్రబాబు చేతులు చాపుతున్నారని అందుకే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి దూరం చేసుకునే కన్నా విమర్శల దాడిని తగ్గించి దరి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చిత్తూరులో పవన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందని దానిపైపోరాటం చేసేందుకు తనతో కలిసి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ గాలి పీల్చారు, నీరు తాగారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి తమతో సహకరించాలని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఏకమయ్యారని విమర్శించారు. ముగ్గురు ఏకమై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే కేసీఆర్ కు ఇబ్బంది కలుగుతుందని అందుకే అడ్డుకుంటున్నారని తెలిపారు. 

అయితే గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానించేవారు. అయితే కుప్పం నియోజకవర్గం వడ్డిపల్లి జన్మభూమి కార్యక్రమంలో విమర్శలు చెయ్యకపోవడం వెనుక పవన్ తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగేవారు. మోదీకి జగన్ దొంగ పుత్రుడు అయితే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ ఘాటుగా విమర్శించేవారు 

అలాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చెయ్యకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం  జగన్ టార్గెట్ గా విమర్శలు సంధించారు. జనసేనపై చంద్రబాబు విమర్శలు చెయ్యకుండా ఆచితూచిగా వ్యవహరిస్తూ సహకరించాలి అంటూ మాట్లాడటం వెనుక అసలు విషయం వేరే ఉందని అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు.  

భవిష్యత్ తో పవన్ కళ్యాణ్ తో పొత్తుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు తాను పవన్ తో కలిసి పోటీ చేస్తే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటగూ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా అనిపిస్తోంది.

click me!