ధూళిపాళ్ళ నరేంద్రకు మరో షాక్... నోటీసులు జారీ చేసిన జగన్ సర్కార్

By Arun Kumar PFirst Published Oct 27, 2021, 10:14 AM IST
Highlights

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు జగన్ సర్కార్ మరో షాకిచ్చింది. ఆయన మేనేజింగ్ ట్రస్టీగా వున్న డివిసి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించి నోటీసులు జారీ చేసింది. 

గుంటూరు: సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏసిబి అధికారుల అరెస్ట్... తర్వాత బెయిల్ పై విడుదల... డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కాకినాడ పోలీసులు నోటీసులు... వీటితోనే ఇబ్బంది పడుతున్న టిడిపి సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు జగన్ సర్కార్ మరో షాకిచ్చింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదర మొమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనానికి చర్యలు తీసుకుంటామని... ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ తాజా నోటీసుల్లో పేర్కొన్నారు. 

సహకార చట్టంలోని సెక్షన్ 6ఏ కింద ధూళిపాళ్ల ట్రస్ట్ ను స్వాదీనానికి చర్యలు తీసుకుంటున్నట్లు... అభ్యంతరాలుంటూ తెలపాలంటూ మేనేజింగ్ ట్రస్టీ dhulipalla narendra ను సూచించింది జగన్ సర్కారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్ లాల్ నోటీసులు జారీ చేసారు. వారంరోజుల్లో ఈ నోటీసులపై సమాధానం ఇవ్వాలని ధూళిపాళ్ల నరేంద్ర కు సూచించారు. 

dhulipalla veeraiah coudary memorial trust ఆధ్వర్యంలో guntur district జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడిలో DVC Hospital నడుస్తోంది. పాడి రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 50శాతం రాయితీతో అంతర్జతీయ ప్రమాణాలు కల్గిన వైద్యం అందిస్తోందని ఈ హాస్పిటల్ కు మంచి పేరుంది. ఈ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే దిశగా వైసిపి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

read more  వారిపై చర్యలు తీసుకోండి.. హైదరాబాద్ పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కూతురు ఫిర్యాదు

ఇదిలావుంటే ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు ధూళిపాళ్లకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల ఇంటికి వెళ్లిన పోలీసులు నోటిసులు అందించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం వున్నట్లు... ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి విచారణకు హాజరై ఆధారాలు ఇవ్వాలంటూ కాకినాడ పోలీసులు ధూళిపాళ్లకు నోటీసులిచ్చారు.

అంతకుముందు సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఏసిబి అధికారులు డెయిరీ చైర్మన్ గా వున్న ధూళిపాళ్ల అరెస్ట్ చేసారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద ఆయన సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కొంతకాలం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న ఆయనకు బెయిల్ లభించి విడుదలయ్యారు.   

ఇలా ఇప్పటికే కేసులు, పోలీస్ నోటీసులతో సతమతమవుతున్న ధూళిపాళ్ల కు వైసిపి ప్రభుత్వం ట్రస్ట్ స్వాధీనం పేరిట మరో షాకిచ్చేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం నోటీసులు జారీచేయడమే కాదు వారంరోజుల్లో అభ్యంతరాలు తెలియజేయాలని ఆదేశించింది. 
 

click me!