
Sajjala Comments: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓ సారిగా.. పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని, ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రకటన తో రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేసింది. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజంగానే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలు ఉంటాయా? జగన్ వైఖరి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇదిలా ఉంటే .. మరోవైపు.. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబునాయుడికి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా.. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ప్రజలు ఐదేళ్లు పరిపాలించడానికే అధికారం ఇచ్చారని చెప్పారు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని అన్నారు.
Read Also: ప్రధాని మోడీ పర్యటన రద్దుపై పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే..?
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే.. ఎన్నికలు జరుగుతాయని సజ్జల తేల్చి చెప్పారు. జగన్ సర్కార్ పై చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక నుంచి అయినా.. చంద్రబాబు కలలు కనడం మానుకోవాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ తన పాలనలో అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని అన్నారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. చంద్రబాబు చెప్పే .. అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని అన్నారు. సీఎం జగన్‌పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీని ఇచ్చారని గుర్తు చేసిన సజ్జల.. రెండున్నరేళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పలితం ఒకే విధంగా వస్తోందని తెలిపారు.
Read Also: పీఆర్సీపై వీడని సస్పెన్షన్.. ముగిసిన జగన్ సమీక్ష, రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ
తెదేపా కార్యకర్తల్లో కూడా చంద్రబాబు నిస్తేజం పోనివ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో స్థానిక ఎన్నికలలో ఓటమి చెందినందున మిమ్మల్ని మీరు మార్చుకోండని విమర్శించారు. గతంలో కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని.. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.