ఏపీలోనూ పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 434 మందికి పాజిటివ్.. 20,59,134కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 05, 2022, 07:01 PM ISTUpdated : Jan 05, 2022, 07:04 PM IST
ఏపీలోనూ పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 434 మందికి పాజిటివ్.. 20,59,134కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 434 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,59,134 కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 434 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,59,134 కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,499కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 102 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,59,134కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 32,785 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,14,58,731కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1848 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 27, చిత్తూరు 68, తూర్పుగోదావరి 34, గుంటూరు 45, కడప 13, కృష్ణ 61, కర్నూలు 8, నెల్లూరు 30, ప్రకాశం 7, శ్రీకాకుళం 9 విశాఖపట్నం 63, విజయనగరం 39, పశ్చిమ గోదావరిలలో 30 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూఎస్ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఓ మహిళకు మాత్రం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఒమిక్రాన్ సోకింది. బాధితుల్లో  గుంటూరు జిల్లాలో ఒక మహిళతో పాటుగా.. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. ఇక, తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. 

ALso Read:విస్తరిస్తోన్న కోవిడ్.. ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

ఇక, ఏపీలో నిన్న కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి వచ్చిన ఒక్కరి చొప్పున ఉన్నారు. బాధితుల్లో ముగ్గురు కృష్ణా జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన నలుగురు ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు. వారిలో ఒకరు  ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌నీ,  ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉంద‌ని తెలిపారు.  వీరందర్నీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకు 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి. ఆ తర్వాత 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్