పీఆర్సీపై వీడని సస్పెన్షన్.. ముగిసిన జగన్ సమీక్ష, రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

By Siva KodatiFirst Published Jan 5, 2022, 9:53 PM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (ys jagan) సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్‌ ఇవ్వాలనే అంశంపై సమాలోచనలు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (ys jagan) సుదీర్ఘంగా చర్చించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్‌ ఇవ్వాలనే అంశంపై సమాలోచనలు చేశారు.

14.29 శాతం పైన ఎంతశాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎంకు ఆర్థికశాఖ అధికారులు వివరాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నారు జగన్. రేపు చర్చలు జరిగే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎంవో వర్గాలు సమాచారమిచ్చాయి.  

కాగా.. సుమారు నెల రోజుల నుండి పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కానీ పీఆర్సీ  విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు sajjala Ramakrishna Reddy, ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana rajendranath reddy ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయమై  కార్యదర్శుల కమిటీ ఇచ్చిన 14.29 ఫిట్‌మెంట్ ను తాము అంగీకరించబోమని  ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.

Also Read:పీఆర్సీ‌పై పీటముడి: రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ,రేపైనా తేలేనా?

27 శాతానికి పైగా ఫిట్‌మెంట్ ఉంటేనే చర్చలకు వస్తామని కూడా సీఎస్   Sameer Sharma కు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పీఆర్సీ విషయమై స్పష్టత రాని  నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలను నిర్ణయించే అవకాశం ఉంది. చర్చల పేరుతో పిలిచి తమను అవమానపరుస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 

పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత కావాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం తాము తీసుకొంటున్న వేతనాల కంటే తక్కువ పిట్‌మెంట్ ఉంటే అంగీకరించబోమని కూడా ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తును ప్రారంభించి దాదాపుగా నెల రోజులు అవుతుంది. అయితే పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సీఎంతో జరిగే సమావేశంలోనైనా పీఆర్సీపై స్పష్టత వస్తోందనే ఆశాభావంతో ఉద్యోగ సంఘాలు ఉన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తిరుపతిలో జగన్ పర్యటించిన సమయంలో  పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల నేతలు దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత పీఆర్సీపై నిపుణుల కమిటీ నివేదికను సీఎంకు ఇచ్చారు. అయితే పీఆర్సీపై నిపుణుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించడం లేదు. 

click me!