వైజాగొస్తున్నా... అరెస్టు చేసుకోవచ్చు

Published : Jan 25, 2017, 06:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
వైజాగొస్తున్నా... అరెస్టు చేసుకోవచ్చు

సారాంశం

వైజాగొస్తున్నా... అరెస్టు  చేసుకోవచ్చు... దానిని  ముఖ్యమంత్రి అభీష్టానికి వదిలేస్తున్నా

విశాఖ బీచ్ లో రేపు జరుగనున్న నిరసనలో పాల్గొంటున్నట్లు వైసిపి నేత ,  ప్రతిపక్ష నాయకుడు జగన్  ప్రకటించారు. ఏమిజరిగినా అక్కడ యువకులు తలపెట్టిన దీప ప్రదర్శనలో పాల్టొంటున్నానని, విశాఖ బయలు దేరుతున్నానని ఆయన ప్రకటించారను.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తే చేసుకోవచ్చు, ఆవిషయాన్ని ఆయన అభీష్టానికి వదిలేస్తున్నానని ఆయన బుధవారంనాడు చెప్పారు.

 

 ఇలాంటి అణచివేత ధోరణి మానుకుని, పోలీపులను యువకుల మీద ప్రయోగించడం మానుకుని, తాను కూడా ఈ నిరసన క్యాండిల్ లైట్ ప్రదర్శనలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు.

 

విశాఖ లోనే, ప్రత్యేక హోదా కోసం ఎక్కడ యువకులు కార్యక్రమాలు ఏర్పాటు చేసినా తాను పాల్గొంటున్నానని ఆయన చెప్పారు.

 

చంద్రబాబు నాయుడు నిజానికి ఢిల్లీకి ఒక బృందాన్ని తీసుకువెళ్లితే బాగుంటుందని చెబుతూ, అవసరమయిన ఎంపిలందరిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళదాం అని ఆయన చెప్పారు.

 

“ఆంధ్రప్రదేశ్ ఎంపిలు ఎందుకు రాజీనామా చేశారు, ఉప ఎన్నికలకు వెళుతున్నారని దేశమంతా ఆలోచించాలి. ఆలోచించేలా చేద్దాం,” అని ఆయన ముఖ్యమంత్రి కి సలహా ఇచ్చారు.

 

ముఖ్యమంత్రి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కలసి వచ్చిన రాకపోయినా, జూన్ దాకా మేం ఎదురు చూస్తాం. ఆతర్వాత రాజీనా మా చేస్తామని జగన్ ప్రకటించారు.

 

తమిళనాడు ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.

 

‘ జల్లికట్టు అనేది ఒక ఆట. ఒక ఆట కోసం తమిళనాడు ముఖ్యమంత్రి అన్ని పార్టీలను  ఒకతాటిమీదకు తెస్తే, జీవన్మరణ సమస్య అయిన హోదా కోసం ఆంధ్రా ముఖ్యమంత్రి ఆ చొరవ చూపకపోవడం సిగ్గు  చేటు ,’ అని జగన్ అన్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu
Nagababu Comments: వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు శివాజీకి నాగబాబు వార్నింగ్| Asianet Telugu