అన్నా రాంబాబు ఎఫెక్ట్: వైవీతో ఐవీ రెడ్డి భేటీ

By narsimha lodeFirst Published 19, Dec 2018, 7:18 PM IST
Highlights

: ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో  కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో  కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు జగన్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ ప్రతిపాదనపై వైసీపీ సమన్వయకర్త ఐవీరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నే రాంబాబు  వైసీపీలో చేరనున్నారు. అన్నే రాంబాబు వైసీపీలో చేరే విషయమై జగన్ గ్రీన్ సిగ్నల్  ఇవ్వడంపై మంగళవారం నాడు  జరిగిన  పార్టీ సమావేశంలో హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది.

అయితే  అన్నే రాంబాబును పార్టీలో తీసుకోవాలనే నిర్ణయంపై ఐవీ రెడ్డి  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని కలిసి  తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని  కలిసి కూడ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అన్నే రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న  సమయంలో  వైసీపీ కార్యకర్తలను  తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని  ఐవీరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఐవీరెడ్డి తన అసంతృప్తిని వైవీ సుబ్బారెడ్డి వద్ద వ్యక్తం చేశారు.

తనకు అన్యాయం జరగదని వైవీ సుబ్బారెడ్డి  తనకు హామీ ఇచ్చారని ఐవీరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో  పార్టీ కార్యక్రమాల్లో తాను చురుకుగా  పాల్గొంటానని ఐవీరెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు షాక్: జనసేనలో చేరనున్న చంద్రశేఖర్ యాదవ్

 

Last Updated 19, Dec 2018, 7:19 PM IST