కరెన్సీ కట్టలు: కల్కి భగవాన్ పై ఈడీ కేసులు, అదుపులో ఆయన కుమారుడు

By narsimha lodeFirst Published Oct 25, 2019, 2:19 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ అధికారుల సోదాల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం నాడు కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులు సుమారు ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. 

చెన్నై: కల్కి భగవాన్‌పై  శుక్రవారం నాడు ఈడీ అధికారులు కేసు పెట్టారు. వారం రోజుల క్రితం సుమారు ఐదు రోజుల పాటు చిత్తూరు జిల్లాలోని  వరదాయపాలెంలో ఆదాయ పన్ను శాఖాధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.

హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఆదాయ పన్ను శాఖాధికారులు గుర్తించారు. ఈ మేరకు చెన్నైలో కల్కి భగవాన్‌పై శుక్రవారం నాడు ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లాలోని వరదాయపాలెంలోని కల్కి ఆశ్రమంతో పాటు దేశ వ్యాప్తంగా 18 చోట్ల ఆదాయ పన్ను శాఖాధికారులు సుమారు ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. కల్కి ఆశ్రమంలో కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

Also Read:కల్కీ ఆశ్రమంపై ఐటీ దాడులు: తవ్వేకొద్దీ బయటపడుతున్న కరెన్సీ, బంగారం

బయటపడిన అక్రమాస్తులు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం నివ్వెరపోయారు. తనిఖీల్లో సుమారు 300 మంది అధికారులు పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. లెక్కల్లోకి రాని రూ.500 కోట్లకు సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు.

చిత్తూరు, హైదరాబాద్, చెన్నై, తిరుపతి, బెంగళూరు సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించారు. 44 కోట్ల నగదు, 20 కోట్ల విదేశీ కరెన్సీ, 90 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

వివాదాస్పద కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మొత్తం 25 ప్రాంతాల్లోని కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Also Read:కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఐటీ దాడులు: అదుపులో కల్కీ కుమారుడు

కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఐటీ దాడులు: అదుపులో కల్కీ కుమారుడు

ఆశ్రమం సీఈవో లోకేశ్ దాసాజీతో పాటు ఇతర సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కల్కీ భగవాన్ కుమారుడు కృష్ణాజీ కేంద్రంగా వరదయ్యపాళెం జీసీ-1, జీసీ-2.. చెన్నై మంగంబాకం కల్కీ బ్రాంచ్‌లోనూ దాడులు కొనసాగుతున్నాయి.

బుధవారం ఉదయం 8 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీలతో పాటు ఆశ్రమంలో గతంలో జరిగిన అవకతవకలపై ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు దృష్టిసారించారు. 

లక్షల కొద్ది భక్తులను సంపాదించుకుని, పలు రాష్ట్రాల్లో ఆశ్రమాలను నడిపిస్తున్న కల్కీ భగవాన్‌పై అనేక వివాదాలు ఉన్నాయి. కల్కీ ఆశ్రమాల్లో అక్రమాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ పరిణామాల నేపథ్యంలో కల్కీ ఆశ్రమాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపాయి. 

Also Read:కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఐటీ దాడులు: అదుపులో కల్కీ కుమారుడు

కల్కి అనుబంధ సంస్థలు మరో ముప్పై చోట్ల కూడా ఐటీ అధికారులు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం .ప్రధానంగా కల్కి ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక పరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్మును భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిపై దుర్వినియోగం అవుతున్నట్టు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే తమిళ్ నాడు ఐటీ అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై దాడులకు పూనుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వరదయ్యపాలెం కల్కి ఆశ్రమంపై బుధవారం ఉదయం నాలుగు ఐటీ ప్రత్యేక బృందాలు దాడులకు పాల్పడడంతో కల్కి నిర్వాహకులు అవాక్కయ్యారు.

దీంతో బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించిన బినామీ తంతు వంటివాటిపై  కలకలం రేగింది. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉంది

click me!