ఐటీ కంపెనీలను వైసీపీ, బీజేపీ అడ్డుకుంటున్నాయి: లోకేష్

Published : Dec 19, 2018, 03:55 PM IST
ఐటీ కంపెనీలను వైసీపీ, బీజేపీ అడ్డుకుంటున్నాయి: లోకేష్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాము ఐటీ కంపెనీలను తీసుకువస్తుంటే అవి రాకుండా వైసీపీ, బీజేపీలు అడ్డుకుంటున్నాయని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. తాడేపల్లిలో ఐదు ఐటీ సంస్థలను మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాము ఐటీ కంపెనీలను తీసుకువస్తుంటే అవి రాకుండా వైసీపీ, బీజేపీలు అడ్డుకుంటున్నాయని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. తాడేపల్లిలో ఐదు ఐటీ సంస్థలను మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. 

జీటీ కనెక్ట్, పారికరం ఐటీ సొల్యూషన్స్‌, టెక్ స్కేప్, ట్రెండ్ సాఫ్ట్, డియాగ్నో స్మార్ట్ సొల్యూషన్స్ కంపెనీలను మంత్రి ప్రారంభించారు. ఏపీఎన్‌ఆర్టీ కార్యాలయం ఇన్ఫోసైట్‌ భవనంలో ఈ ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంతా తాము పనిచేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని త్వరలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?