ప్రియ మిత్రుడు కేసీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్: కెఎ పాల్

Published : Jan 17, 2019, 08:02 AM IST
ప్రియ మిత్రుడు కేసీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్: కెఎ పాల్

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం చేసి కాంగ్రెస్, టీడీపీని భూస్థాపితం చేశారని, ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్‌ను కలవడం తమ పార్టీకి మంచి శుభవార్త పాల్ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు, వైసీపీ అధినేత జగన్ భేటీతో ఏపీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు తెలంగాణ ముఖ్మయంత్రి కె చంద్రశేఖర రావు ప్రచారం చేస్తే డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు.
 
తెలంగాణ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం చేసి కాంగ్రెస్, టీడీపీని భూస్థాపితం చేశారని, ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్‌ను కలవడం తమ పార్టీకి మంచి శుభవార్త పాల్ అన్నారు. కేసీఆర్ ఏపీ వెళ్లి ప్రచారం చేస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన అభిప్రాయపడ్డారు. 

జగన్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, తెలంగాణకు చెందిన వ్యక్తిగా కేసీఆర్ మీద ఏపీ ప్రజలకు ఉన్న ఆగ్రహం వంటి కారణాల వల్ల ఈ రెండు పార్టీలు కలవడం ప్రజాశాంతి పార్టీకి మంచి అవకాశని ఆయన అన్నారు. తన ప్రియ మిత్రులు కేసీఆర్ తనకు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని అన్నారు. 

జగన్ కూడా గెలుస్తారో లేదో తెలియదని, ఏపీలో ఆయనపై చాలా వ్యతిరేకత ఉందని పాల్ అన్నారు. ఇప్పటికే జగన్ మీద 12 కేసులున్నాయని, రెండేళ్లు జైలు కెళ్లారని ఆయన అన్నారు. జగన్‌ను కలిసినందుకు కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu