సెల్ప్ గోల్: కేటీఆర్ తో జగన్ భేటీపై గంటా వ్యాఖ్యలు

Published : Jan 17, 2019, 07:13 AM IST
సెల్ప్ గోల్: కేటీఆర్ తో జగన్ భేటీపై గంటా వ్యాఖ్యలు

సారాంశం

సెల్ఫ్ గోల్స్ చేసుకోవడం జగన్‌కు అలవాటేనని గంటా శ్రీనివాస రావు అన్నారు.ఈ సెల్ఫ్ గోల్ నుంచి జగన్‌ బయటపడే అవకాశమే లేదని ఆయన ఆయన అన్నారు. తెలుగు తల్లిని, ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను కేసీఆర్ కించపర్చారని ఆయన గుర్తు చేశారు.

విశాఖపట్నం: ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పెద్ద తప్పు చేశారని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో జగన్ భేటీపై ఆయన బుధవారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు. 
 
సెల్ఫ్ గోల్స్ చేసుకోవడం జగన్‌కు అలవాటేనని గంటా శ్రీనివాస రావు అన్నారు.ఈ సెల్ఫ్ గోల్ నుంచి జగన్‌ బయటపడే అవకాశమే లేదని ఆయన ఆయన అన్నారు. తెలుగు తల్లిని, ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను కేసీఆర్ కించపర్చారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక మిథ్య అని గంటా వ్యాఖ్యానించారు. 

తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీని, చంద్రబాబును ఏమీ చేయలేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్