
టీడీపీ నేత గెస్ట్ గౌస్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని నడవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ నేతకు చెందిన గెస్ట్ హౌజ్ లో ఇద్దరు అమ్మాయిలతో మంగళవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయించారు. కాగా.. ఈ విందులో పాల్గొన్న కొందరు యువకులు పీకలదాకా మద్యం తాగి.. గొడవ చేశారు. ఈ క్రమంలో అమ్మాయిలను కిరాయికి తెచ్చిన మధ్యవర్తి తో యవకులకు ఘర్షణ చోటుచేసుకుంది.
వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో.. మధ్యవర్తిని యువకులు చితకబాదారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్యాన్స్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి నిందితుడిని స్టేషన్ నుంచి తీసుకుపోయారు. అయితే రాజకీయ వత్తిడికి తలొగ్గిన పోలీసులు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నడవపల్లిలో నిందితుని గెస్ట్‌హౌస్‌లో నిత్యం ఇలాంటి అశ్లీల నృత్యాలు, పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.