
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఘనంగా పౌర సన్మానం నిర్వహించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఉప రాష్ట్రపతి హోదాలో సొంత రాష్ట్రనికి విచ్చేసిన ఆయనకు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానం చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో వెంకయ్య నాయుడికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. వెంకయ్య నాయుడు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.