బ్రేకింగ్ న్యూస్ : కేంద్రంపై కోర్టులో రాష్ట్రం కేసు?

First Published Feb 14, 2018, 11:24 AM IST
Highlights
  • రెవిన్యూలోటు భర్తీపై కోర్టుకు వెళ్ళటమొకటే మార్గమని సమీక్షల్లో పలువురు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారట.

కేంద్రప్రభుత్వంపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందా? అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. మంగళ, బుధ వారాల్లో చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశాల్లో అధికారులు, మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూలోటు భర్తీపై కోర్టుకు వెళ్ళటమొకటే మార్గమని సమీక్షల్లో పలువురు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారట.

విభజన చట్టం ప్రకారం రెవిన్యూలోటు భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అయితే, లోటును లెక్కించటంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లెక్కల్లో తేడాలున్నాయి. దాంతో గడచిన మూడున్నరేళ్ళుగా ఆ తేడాలు సర్దుబాటు కావటం లేదు. అందుకే రెవిన్యూలోటు భర్తీలో ప్రతిష్టంభన ఏర్పడింది. త్వరలో ఎన్నికలు వస్తుండటం, మొన్న ప్రవేశపెట్టిందే చివరి బడ్జెట్ కావటంతో రాజకీయ పార్టీల్లో వేడెక్కింది.

అదే సమయంలో కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు కనబడాలి కాబట్టి చంద్రబాబు కూడా నానా హడావుడి చేస్తున్నారు. అందులో భాగమే రెవిన్యూలోటుపై కోర్టులో కేసు అంశం. రెవిన్యూ లోటుపై కేంద్రంపై కోర్టుకు వెళ్ళక తప్పదని సమీక్షల్లో పొల్గొంటున్న ఓ కీలక వ్యక్తి చెప్పారు. రాష్ట్ర విభజనలో రెవిన్యూలోటు రూ. 16,078 కోట్లుగా గుర్తించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి లెక్కించిన మొత్తమే రూ. 7509 కోట్లు. అందులో రూ. 3520 కోట్లు రావాల్సుండగా కేంద్రం మాత్రం రూ. 139 కోట్లే ఇస్తామంటోందన్నారు. అవసరమైతే ఆ విషయంలోనే కోర్టుకు వెళతామంటూ చెప్పారు.

click me!