బ్రేకింగ్ : ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష

First Published Feb 14, 2018, 10:19 AM IST
Highlights
  • హోదా డిమాండ్ తో జగన్ గుంటూరు, ఏలూరు, ఢిల్లీలో జగన్ దీక్ష చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రత్యేకహోదా సాధన కోసం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో దీక్ష చేయనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో కూడా హోదా డిమాండ్ తో జగన్ గుంటూరు, ఏలూరు, ఢిల్లీలో జగన్ దీక్ష చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకహోదా కోసం అప్పట్లో ఇపుడున్నంత సీరియస్ నెస్ లేదనే చెప్పాలి. దానికితోడు మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రయోజనాలపై ఒక్కమాట కూడా కేంద్రం ప్రస్తావించలేదు. దాంతో రాష్ట్రంలో జనాలు, పార్లమెంటులో ఎంపిలు వాతావరణాన్ని వేడెక్కించారు.

దానికితోడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెటే చివరిది కావటం, త్వరలో ఎన్నికలు ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నెల్లూరు జిల్లా ఉదియగిరిలో పాదయాత్ర  చేస్తున్న జగన్ ఎంపిల రాజీనామాను ప్రకటించారు. దాంతో రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. హోదా కోసం ఎంపిలు రాజీనామాపై గతంలోనూ ప్రకటించినా ఈసారి మాత్రం తేదీతో సహా ప్రకటించటంతో జగన్ సీరియస్ నెస్ అర్ధమవుతోంది. అందుకే టిడిపి ఉలిక్కిపడుతోంది.

ఏప్రిల్ 6వ తేదీ వరకూ ప్రత్యేకహోదాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అదే రోజు తమ ఎంపిలు రాజీనామాలు చేస్తారని జగన్ చెప్పారు. అయితే, అటు కేంద్రంపైనే కాకుండా ఇటు చంద్రబాబుపైన కూడా ఒత్తిడి తేవటంలో భాగంగా జగన్ దీక్ష కూడా మొదలుపడతారట. అయితే, దీక్ష చేసే తేదీపై స్పష్టత లేదు.  పార్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం రాజీనామాలు చేసే ముందు రోజు దీక్ష చేసే అవకాశం ఉంది. ఆరోజు జగన్ పాదయాత్రలో ఎక్కడుంటే అక్కడే దీక్షకు కూర్చుంటే బాగుంటుందని పార్టీలోని ముఖ్యులు సూచించారట. అదే సమయంలో మొత్తం పార్టీ యంత్రాంగంతో కూడా దీక్షలు చేయిస్తే బాగుంటుందని కూడా సూచనలు అందుతున్నాయట. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.

 

click me!