వైసీపీలోకి చక్రపాణిరెడ్డి ?

Published : Jul 10, 2017, 07:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
వైసీపీలోకి చక్రపాణిరెడ్డి ?

సారాంశం

పార్టీలో పరిణామాలను గమనించిన చక్రపాణిరెడ్డికి కూడా తాను టిడిపిలో ఉండలేనన్న విషయం అర్ధమైపోయింది. దాంతో పార్టీ మారే యోచన చేస్తున్నారు. అదే విషయాన్ని మోహన్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయమవుతుంది.

ముందునుండి అనుమానిస్నస్తున్నదే జరుగుతోంది. నంద్యాల నేత శిల్పాచక్రపాణిరెడ్డి కూడా త్వరలో వైసీపీలో చేరనున్నారా? టిడిపిలో పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చక్రపాణిరెడ్డికి పార్టీ నేతలందరూ పొమ్మన కుండా పొగబెడుతున్నట్లే ఉంది. నంద్యాలలో పోటీ చేసే అవకాశం లేకపోవటంతో సోదరుడు శిల్పామోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పటి నుండి చక్రపాణిరెడ్డికి టిడిపిలో ఇబ్బందులు మొదలయ్యాయి.

నిజానికి శిల్పా సోదరులకు నంద్యాలలో బలమైన వర్గమున్నా ఇద్దరిలోనూ మోహన్ రెడ్డే కీలకమన్నది  వాస్తవం. ఎప్పుడైతే మోహన్ రెడ్డి టిడిపిని వదిలేసారో అప్పటి నుండి చక్రపాణి రెడ్డికి సమస్యలు మొదలయ్యాయి. ఎప్పుడో ఒకపుడు చక్రపాణిరెడ్డి కూడా టిడిపిని వదిలేస్తారు అని మిగిలిన నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

తమ అనుమానాలకు తోడు చేతల్లో కూడా అదే విషయాన్ని చూపటం మొదలుపెట్టారు. మోహన్ రెడ్డి టిడిపిలో ఉన్నంత వరకూ చక్రపాణిరెడ్డే జిల్లా అధ్యక్షుడు. అయితే, తరువాత చక్రపాణిరెడ్డిని తీసేసారు. నంద్యాల ఉపఎన్నికకు సంబంధించిన ఏ సమావేశంలో కూడా చక్రపాణిరెడ్డిని పిలవటం మానేసారు. ఇటీవల రంజాన్ సందర్భంగా చంద్రబాబునాయుడు నంద్యాలలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా చక్రపాణిరెడ్డికి ఆహ్వానం లేదు. అంతెందుకు, కర్నూలు జిల్లా పర్యటనకు సిఎం వస్తున్న సమాచారం కూడా చక్రపాణిరెడ్డి అధికారికంగా తెలపలేదు.

సిఎం పాల్గొన్న కార్యక్రమాల్లో చక్రపాణిరెడ్డి హాజరైనా ఎవ్వరూ పట్టించుకోలేదు. దానికితోడు నంద్యాల ఉపఎన్నికపై మంత్రులు నిర్వహిస్తున్న ఎటువంటి సమావేశానికీ చక్రపాణిరెడ్డికి ఆహ్వనం అందటం లేదు. అంటే టిడిపి నేతలందరూ చక్రపాణిరెడ్డిని వైసీపీ నంద్యాల అభ్యర్ధి, సోదరుడు మోహన్ రెడ్డికి కోవర్టుగా అనుమానిస్తున్నట్లు కనబడుతోంది. దాంతో చక్రపాణిరెడ్డి బాగా సఫకేటింగ్ ఫీలవుతున్నారు. అంటే ఒకరకంగా టిడిపి నేతలే చక్రపాణిరెడ్డిని పార్టీ నుండి బయటకు పంపేస్తున్నారు.  

పార్టీలో పరిణామాలను గమనించిన చక్రపాణిరెడ్డికి కూడా తాను టిడిపిలో ఉండలేనన్న విషయం అర్ధమైపోయింది. దాంతో పార్టీ మారే యోచన చేస్తున్నారు. అదే విషయాన్ని మోహన్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయమవుతుంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu