భువనేశ్వరికి నిజంగా దణ్ణం పెట్టాలి..

Published : Jul 09, 2017, 12:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
భువనేశ్వరికి నిజంగా దణ్ణం పెట్టాలి..

సారాంశం

తనకు జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచి పదవి పోవటానికి, మరణానికి కారకుడైన భర్త చంద్రబాబును సహిస్తున్న భువనేశ్వరికి నిజంగా చేతులెత్తి దణ్ణం పెట్టాలన్నారు. ఎన్టీఆర్ ను చూసిన ప్రతీసారి భువనేశ్వరి పడే బాధ ఎవరికీ చెప్పుకోలేందన్నారు.

‘జన్మనిచ్చిన తండ్రికి వెన్నుపోటు పొడిచినా భరిస్తున్న నారాభువనేశ్వరికి చేతులెత్తి దణ్ణం పెట్టాలి’....ఇది వైఎస్ షర్మిల నారా భువనేశ్వరి గురించి అన్నమాటలు. విజయవాడ-గుంటూరు మధ్య జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో షర్మిల ఆదివారం ప్రసంగించారు. సూటిగా, క్లుప్తంగా మాట్లాడిన షర్మిల ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. తన ప్రసంగంలో ఒకవైపు చంద్రబాబునాయుడు వ్యక్తిత్వాన్ని, పరిపాలనపై ధ్వజమెత్తుతూనే అదే సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ప్రసంసలు కురిపించటం ఆశక్తిగా ఉంది.

షర్మిల మాట్లాడుతూ, కూతురినిచ్చిన మామగారు ఎన్టీఆర్ నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ ధ్వజమెత్తారు. ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం కావాలన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవటమనే నీచరాజకీయాలు తప్ప ఎదురుగా వచ్చి దాడిచేసే ధైర్యం లేదని ఎద్దేవా చేసారు. అందుకు ఎన్టీఆర్ ను పదవిలో నుండి దింపేయటమే నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేయటమే కాకుండా ఆయన మృతికి కూడా చంద్రబాబు కారణమయ్యారంటూ తూర్పారబట్టారు.

తనకు జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచి పదవి పోవటానికి, మరణానికి కారకుడైన భర్త చంద్రబాబును సహిస్తున్న భువనేశ్వరికి నిజంగా చేతులెత్తి దణ్ణం పెట్టాలన్నారు. ఎన్టీఆర్ ను చూసిన ప్రతీసారి భువనేశ్వరి పడే బాధ ఎవరికీ చెప్పుకోలేందన్నారు. వెన్నుపోట్లు, మోసం, దిగజారుడు రాజకీయాలు చంద్రబాబుకు బాగా అలవాటుగా షర్మిల ఎద్దేవా ధ్వజమెత్తారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే