రెండు రోజుల్లో చెబుతానన్నాడు...పత్తాలేడు..పాపం టిడిపి

First Published Aug 8, 2017, 6:55 AM IST
Highlights
  • ఏదో కాలక్షేపానికి మాత్రమే రాజకీయాలు చేస్తుంటారు.
  • అటువంటి వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మొదటివరసలో ఉంటారు.
  • సినిమాల మధ్య గ్యాప్ లోను లేదంటే సినిమా షూటింగుల్లో విసిగిపోయినపుడో పవన్ మీడియా ముందుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడేస్తుంటారు.
  • అది కూడా వద్దనుకుంటే ట్విట్టర్లో ఓ ట్వీటు పడేస్తారు.
  • ఇప్పటి వరకూ పవన్ రాజకీయమైతే ఇదే పద్దతిలో ఉన్నదన్నది వాస్తవం.

రాజకీయాలను చాలా మంది సీరియస్ గానే తీసుకుంటారు. సామాన్య జనాలకు మాత్రం రాజకీయమంటేనే రోతలాగ తయారైపోయింది. అయితే, రెండు వర్గాలకు చెందని మరికొందరుంటారు. వారికి రాజకీయాలంటే సరదా. ఏదో కాలక్షేపానికి మాత్రమే రాజకీయాలు చేస్తుంటారు. అటువంటి వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మొదటివరసలో ఉంటారు. సినిమాల మధ్య గ్యాప్ లోను లేదంటే సినిమా షూటింగుల్లో విసిగిపోయినపుడో పవన్ మీడియా ముందుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడేస్తుంటారు. అది కూడా వద్దనుకుంటే ట్విట్టర్లో ఓ ట్వీటు పడేస్తారు. ఇప్పటి వరకూ పవన్ రాజకీయమైతే ఇదే పద్దతిలో ఉన్నదన్నది వాస్తవం.

ఇపుడిదంతా ఎందుకంటే, నంద్యాలలో ఉపఎన్నిక జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీలు అభ్యర్ధులు తీవ్రస్ధాయిలో పోటీ పడుతున్నారు. సరే, కాంగ్రెస్, రాయలసీమ పరిరక్షణ సమతితో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా అభ్యర్ధులతో నామినేషన్లు వేయించాయి. పోలింగ్ తేదీ కూడా దగ్గరకు వచ్చేస్తోంది. ఇంత వరకూ అడ్రస్ లేనిది ఒక్క పవన్ మాత్రమే. ఎన్నికలో పోటీ చేయటం, చేయకపోవటం పూర్తిగా పవర్ స్టార్ ఇష్టమే. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం అక్కర్లేదు.

యావత్ దేశం దృష్టి ఇపుడు నంద్యాల ఉపఎన్నికపైనే ఉందనటంలో సందేహమే లేదు. అటువంటిది ప్రశ్నింటానికే ఓ రాజకీయ పార్టీని పెట్టిన పవన్ మాత్రం అడ్రస్ లేడు. పైగా పోయిన నెలలో ఉద్దానంపై చంద్రబాబునాయుడుతో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘రెండు రోజుల్లో నంద్యాలపై ప్రకటన చేస్తా’నంటూ చెప్పాడు. చెప్పికూడా దాదాపు పదిరోజులవుతోంది. మళ్ళీ ఇంత వరకూ పత్తాలేడు.  

నంద్యాలలో టిడిపి అభ్యర్ధి గెలుపు అంత ఈజీ అయితే కాదు. గట్టిగా మాట్లాడితే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్ధితిలో చంద్రబాబు చేసిన రెండు పర్యటనలు కూడా టిడిపికి ఇబ్బందినే తెచ్చిపోట్టాయి. దాంతో టిడిపి నేతలందరూ ఇపుడు పవన్ వైపే చూస్తున్నారు. పైగా నియోజకవర్గంలో పవన్ సామాజికవర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయ్. అందుకే మిత్రధర్మంగా పవన్ వచ్చి తమను ఆతుకుంటాడని ఎదురుచూస్తున్నారు. కనీసం టిడిపికి మద్దతుగా ఇంత వరకూ ఓ ట్వీట్ కూడా లేదు. ఏదో ఖాళీ సమయాల్లో మాత్రమే రాజకీయాలు చేసే పవన్ నుండి నంద్యాల ఉపఎన్నికపై టిడిపి నేతలకు ఇంత వరకూ ఎటువంటి కబురూ అందలేదు. అసలు వస్తాడో రాడో కూడా అర్ధం కావటం లేదు.

click me!