రామసుబ్బారెడ్డికి పరీక్షేనా ?

First Published Jul 1, 2017, 3:25 PM IST
Highlights

ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుపొందిన నంద్యాలలో అదే ఫ్యాక్షన్ రాజకీయాల్లో బాగా అనుభవమున్ననేతల సేవలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించినట్లున్నారు. ఇందులో భాగంగానే తనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ సమావేశమయ్యారు. నంద్యాల నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం ఓట్లను టిడిపివైపు మళ్ళించే బాధ్యతను రామసుబ్బారెడ్డికి అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది.

కడప జిల్లాలో సీనియర్ నేత అయిన నేత రామసుబ్బారెడ్డికి పరీక్షేమన్నా పెడుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. శనివారం రెడ్డి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చాలా కాలంగా రెడ్డి చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తనను అవసరానికి వాడుకుని వదిలేసారని చంద్రబాబుపై రెడ్డి బాగా కోపంతో ఉన్నారు. రెడ్డి కోపాన్ని చంద్రబాబు కూడా గ్రహించారు. అయితే, కావాలనే ఇంతకాలం పట్టించుకోలేదు. అటువంటిది ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా రెడ్డిని ఎందుకు పిలిపించుకున్నట్లు? అంటే, నంద్యాల ఉపఎన్నిక గురించే అన్న సమాధానం వస్తోంది పార్టీ నేతల నుండి.

వైసీపీ ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి విషయంలో చంద్రబాబుపై జమ్మలమడుగు నేత తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే కదా? అందుకే, విశాఖపట్నంలో జరిగిన మహానాడుకు కూడా హాజరుకాలేదు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు గానీ రామసుబ్బారెడ్డి హాజరుకావటం లేదు.

ఇటువంటి పరిస్ధితిల్లో చంద్రబాబును ప్రత్యేకంగా కలవటంలోని ఆంతర్యమేంటని పలువురు నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే, నంద్యాల ఉపఎన్నిక విషయంపైనే ఇద్దరిమధ్య చర్చ జరిగిఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలో గెలవటం చంద్రబాబుకు పెద్ద ప్రతిష్టగా మారింది.  ఒకవేళ ఉపఎన్నికలో ఓడిపోతే చంద్రబాబుకు పెద్ద దెబ్బే. అందుకనే అందుబాటులో ఉన్న ఏ అంశాన్ని వదిలిపెట్టకూడదని చంద్రబాబు అనుకున్నారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుపొందిన నంద్యాలలో అదే ఫ్యాక్షన్ రాజకీయాల్లో బాగా అనుభవమున్ననేతల సేవలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించినట్లున్నారు. ఇందులో భాగంగానే తనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ సమావేశమయ్యారు. నంద్యాల నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం ఓట్లను టిడిపివైపు మళ్ళించే బాధ్యతను రామసుబ్బారెడ్డికి అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది.

అసలే నియోజకవర్గంలో రెడ్డి డామినేషన్ చాలా ఎక్కువ. రామసుబ్బారెడ్డిని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ కోపంతో రామసుబ్బారెడ్డి గనుక వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే ‘మూలిగే నక్కపై తాడిపండు పడినట్ల’వుతుంది టిడిపి పరిస్ధితి. అలాకాకుండా ప్రత్యేక బాధ్యతల పేరుతో రామసుబ్బారెడ్డికి నంద్యాల బాధ్యతలు అప్పగిస్తే ఏ మేరకు మనస్పూర్తిగా పార్టీ కోసం పనిచేస్తున్నది అనుక్షణం చంద్రబాబు గమనించే అవకాశాలున్నాయి. అంటే ఒకవిధంగా రామసుబ్బారెడ్డికి శీల పరీక్షే అనుకోవచ్చు. మరి, రామసుబ్బారెడ్డి ఏం చేస్తారో చూడాలి.

click me!