చంద్రబాబు : ఉక్కిరి బిక్కిరవుతున్నారా ?

Published : Oct 23, 2017, 10:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
చంద్రబాబు : ఉక్కిరి బిక్కిరవుతున్నారా ?

సారాంశం

చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయ్ పార్టీ వర్గాలు. నాలుగువైపుల నుండి సమస్యలు కమ్ముకుంటున్నాయ్. దాంతో వాటిల్లోనుండి బయటపడటానికి ఇబ్బందులు పడుతున్నారు.

చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయ్ పార్టీ వర్గాలు. నాలుగువైపుల నుండి సమస్యలు కమ్ముకుంటున్నాయ్. దాంతో వాటిల్లోనుండి బయటపడటానికి ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెడుతున్నారు. జగన్ పాదయాత్ర అంటేనే టిడిపి నేతలు ఉలిక్కిపడుతున్నారు. దానికితోడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి వీలుగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.

ఇక, దిగజారిపోతున్న రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి గురించి అందరికీ తెలిసిందే. ప్రాజెక్టుల పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చివరకు పోలవరం పనులు కూడా పదిరోజుల నుండి నిలిచిపోయాయి. వీటన్నింటి మీద టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా పెట్టిన చిచ్చు. సమస్యలు నాలుగువైపుల నుండి ఒక్కసారిగా కమ్ముకోవటంతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితంటారా కొత్తేమీకాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఉన్నదే. కాకపోతే అప్పులు 2 లక్షల కోట్లకు చేరుకుంది. సరే, కేంద్రం కూడా ఆదుకోవటం లేదనుకోండి అదివేరే సంగతి. జగన్ పాదయాత్ర అంటారా? పాదయాత్ర సజావుగా సాగకుండా ఎంత వీలైతే అంతా ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి టిడిపి వర్గాలు. అది మొదలైన తర్వాత గానీ తెలీదు. పవన్ విషయం తీసుకుంటే సినీ నటుడుగా పవన్ కు అభిమానులన్నది వాస్తవం. కానీ జనసేనకు మాత్రం నిర్దిష్టమైన పార్టీ యంత్రాంగం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

చివరగా రేవంత్ వ్యవహారమంటారా ? అదే పెద్ద సమస్యగా మారిపోయింది. టిడిపిని వదిలేయటానికి నిర్ణయించుకున్న తర్వాతే రేవంత్ తెలంగాణా, ఏపి టిడిపి నేతలపై రెచ్చిపోతున్నారన్న విషయం అర్ధమైపోతోంది. సరే, రేపు చంద్రబాబుతో భేటీ తర్వాత రేవంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఇప్పటికైతే రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి బాగా డ్యామేజ్ అయ్యిందన్నది వాస్తవం. 26న విదేశాల నుండి రాగానే సమస్యల్లో నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

రేపల్లెపై గర్జించిన యెల్లో సింగం | CM Chandrababu Aggressive Speech At Repalle | Asianet Telugu
చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution