సిబిఐ విచారణంటే భయపడుతున్నారా?

First Published Jun 20, 2017, 8:41 AM IST
Highlights

ప్రతిపక్షాలడిగినట్లు అప్పట్లో సిబిఐతోనే విచారణ చేయించారు కదా కదా? మరి అదే పద్దతిలో ఇపుడు సిబిఐతో విచారణ చేయించటానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు? విచారణకు వెనకాడటమంటే భయపడుతున్నారని జనాలకు  మెసేజ్ ఇవ్వటం కాదా?

‘సిబిఐ విచారణకు ఇస్తే 20 ఏళ్ళు పడుతుంది’ ఇది చంద్రబాబునాయుడు  చేసిన వ్యాఖ్య. విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్రను ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. గడచిన మూడేళ్ళుగా భయపడిన ఏ కుంభకోణం, ఏ అవినీతి విషయంలోనూ విపక్షాలు డిమాండ్ చేసినట్లు సిబిఐ విచారణకు అంగీకరించలేదు. ఎందుకంటే, సిబిఐ విచారణ దండగంటున్నారు. మరి, ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రతీ విషయానికీ చంద్రబాబు సిబిఐ విచారణనే డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగురోడ్డు నిర్మాణం, పలు సంస్ధలకు భూ కేటాయింపులు, ఫోక్స్ వ్యాగన్ కార్ల కుంభకోణం, పరిటాల రవి హత్య, జలయజ్ఞం.. ఇలా ప్రతీదానిలోనూ అవినీతి జరిగిందంటూ టిడిపి అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ప్రతీ అవినీతిపైనా సిబిఐ విచారణను డిమాండ్ చేసింది.

వైఎస్ కూడా ప్రతిపక్షం అడిగినట్లు సిబిఐ విచారణను వేసారు, క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. క్లీన్ చిట్ రావటంపైన కూడా టిడిపి ఆరోపణలు చేసింది. సరే, విచారణ ఏ విధంగా జరిగిందన్నది వేరే సంగతి. ప్రతిపక్షాలడిగినట్లు అప్పట్లో సిబిఐతోనే విచారణ చేయించారు కదా కదా? మరి అదే పద్దతిలో ఇపుడు సిబిఐతో విచారణ చేయించటానికి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారు? విచారణకు వెనకాడటమంటే భయపడుతున్నారని జనాలకు  మెసేజ్ ఇవ్వటం కాదా?

ఇక, ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నాయన్న ఆరోపణొకటి. ప్రతిపక్షాలన్న తర్వాత రాజకీయమే చేస్తాయి. ప్రతిపక్షంలో చంద్రబాబు చేసిందేమిటి? గడచిన మూడేళ్ళుగా చేస్తున్నదేంటి? ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయ్ కదా. ఇలానే ఉంటాయి రాజకీయాలు.

 

click me!