ఆది పై చంద్రబాబు ఆగ్రహం ?

First Published Nov 11, 2017, 12:28 PM IST
Highlights
  • మంత్రి ఆదినారాయణ రెడ్డిపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మంత్రి ఆదినారాయణ రెడ్డిపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫిరాయింపు మంత్రి అన్న ఆరోపణలు, విమర్శల నుండి మార్కెటింగ్ శాఖ మంత్రి తనను తాను రక్షించుకునేందుకు స్పీకర్, చంద్రబాబులను సీన్ లోకి లాగిన విషయం తెలిసిందే. ఇటీవలే మంత్రి ఫిరాయింపు గురించి మాట్లాడుతూ, ఎంఎల్ఏ పదివికి తానెప్పుడో రాజీనామా చేసానని చెప్పారు.

అంతే కాకుండా ‘తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కోడెల శివప్రసాదరావే’నని స్పష్టం చేసారు. అలాగే, ‘చంద్రబాబు నుండి ఆదేశాలు రాకపోవటం వల్లే స్పీకర్ కూడా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు’ అన్న అర్ధం వచ్చేలా మీడియాతో మాట్లాడారు.

దాంతో ఇటు స్పీకర్ అటు చంద్రబాబు ఒకేసారి ఇబ్బందుల్లో పడ్డారు. చంద్రబాబు నుండి తగిన ఆదేశాలు రాకపోవటం వల్లే స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారన్న విషయం ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలతో అర్ధమవుతోంది. అదే సమయంలో మంత్రి ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేసారు. నిర్ణయాలు తీసుకోవటంలో స్పీకర్ స్వతంత్రుడు కాదు అని తేల్చి చెప్పినట్లైంది.

అదే విషయం స్పీకర్, చంద్రబాబు దృష్టికి చేరిందట. దాంతో ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇద్దరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కొందరు మంత్రులతో అసెంబ్లీలోని తన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘తన ఇష్టం వచ్చినట్ల మాట్లాడవద్దని ఆదినారాయణరెడ్డికి చెప్పండి’ అంటూ ఆదేశించారట. ‘మంత్రి  మాటల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామ’ని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారట. అదే విషయాన్ని కొందరు ఆది దృష్టికి వెంటనే తీసుకెళ్ళారట లేండి. మరి, ఇప్పటికైనా మంత్రి జాగ్రత్తగా ఉంటారా?

 

click me!