
విశాఖపట్నం జిల్లాలో జరిగిన భారీ భూస్కాంలో సూత్రదారుడు నారా లోకేషేనా? ప్రతిపక్ష వైసీపీ అలాగనే ఆరోపణలు చేస్తోంది. ఐదు నియోజకవర్గాలో ప్రభుత్వానికి చెందిన సుమారు 7 వేల ఎకరాలు టిడిపి నేతల సొంతమైపోయింది. వాటి విలువ దాదాపు రూ. 25 వేల కోట్లట. వైసీపీ ప్రకారమైతే రూ. 3 లక్షల కోట్లు. విలువెంతన్నది పక్కన బెడితే భారీఎత్తున భూకుంభకోణం జరిగిందన్నది వాస్తవం. ఎందుకంటే, అవకతవకలు జరిగినట్లు జిల్లాకలెక్టర్ ప్రవీణ్ కుమార్, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధృవీకరిచారు. కాకపోతే సూత్రదారులెవరన్నదే తేలటం లేదు.
24 గంటలూ పారదర్శకత గురించే మాట్లాడే నిప్పు చంద్రబాబునాయుడు ఈ భూ స్కాం గురించి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు? విషయమేంటంటే స్కాంకు సూత్రదారునిగా లోకేష్ అని పాత్రదారులుగా మంత్రి గంటాశ్రీనివాసరావు, ఎంఎల్ఏలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, వంగలపూడి అనిత, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద్ లపై వైసీపీ ఆరోపిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నా ఒక్కరు కూడా ఖండించటం లేదు. ఇక్కడే లోకేష్ పాత్రపై అందరిలోనూ అనుమానాలు బటపడుతున్నాయ్.
ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాలను ప్రజాప్రతినిధులు చెప్పిన పేర్లతో రాసేసారంటే అధికారుల స్ధాయిలో జరిగింది మాత్రం కాదన్నది వాస్తవం. అధికారుల వెనుక పార్టీలోని ప్రముఖల హస్తం ఉండబట్టే ఇంత పెద్ద స్కాం సాధ్యమైంది. కాకపోతే వారి దురదృష్టం కొద్ది బయటపడిందంతే.
విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటానే ల్యాండ్ స్కాంపై ఈరోజు సమీక్షించటం. ఆక్రమణలు అరికట్టేందుకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తమని ప్రకటించారు. ఆక్రమణదారులు ఎవ్వరినీ వదిలిపెట్టరట. ఎలాగుంది నిప్పు వారి ప్రభుత్వ నాటకం? ఇదిలావుండగా, స్కాంపై 15వ తేదీన బహిరంగ విచారణ తర్వాత కుంభకోణంపై జాతీయ నాయకత్వానికి ఓ నివేదిక పంపాలని స్ధానిక భాజపా నేతలు నిర్ణయించారట.