జగన్ హత్యకు కుట్రా ? నిజమేనా?

First Published Jun 10, 2017, 7:58 AM IST
Highlights

జగన్ ఛాంబర్లోకి నీరు లీకవ్వటం చూస్తుంటే తమ అధినేతను అంతమొందించాలన్న కుట్రకు బీజం పడిందనే అనుమానాలను ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న జగన్ పై ఇప్పటికే కేసులు పెడుతున్న విషయాన్ని రోజా గుర్తు చేసారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వెలగపూడి అసెంబ్లీలోని నీటి లీకేజి కుట్రలో భాగమేనంటూ వైసీపీ ఎంఎల్ఏ రోజా శుక్రవారం చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. నీటి లీకేజి ద్వారా షార్ట్ సర్క్యూట్ చేయించి జగన్ హత్యకు కుట్ర జరిగిందట. క్యాబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేత జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందంటూ మండిపడ్డారు.

జగన్ ఛాంబర్లోకి నీరు లీకవ్వటం చూస్తుంటే తమ అధినేతను అంతమొందించాలన్న కుట్రకు బీజం పడిందనే అనుమానాలను ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న జగన్ పై ఇప్పటికే కేసులు పెడుతున్న విషయాన్ని రోజా గుర్తు చేసారు. తమ అనుమానాలపై సిఐడితో కాకుండా సిబిఐతో విచారణ చేయిస్తే నిజాలు బయటకు వస్తాయని రోజా డిమాండ్ చేయటం గమనార్హం. అయితే, ఇంత చెప్పిన రోజా జగన్ హత్యకు ఎవరు కుట్ర చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

సరే, రోజా ఆరోపణలను పక్కన బెడితే ఇక్కడే కొన్నిసందేహాలు వస్తున్నాయ్. అసెంబ్లీ సమావేశాలు లేనపుడు జగన్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు? జగన్ దేశంలోనే లేనపుడు ఛాంబర్లో నీటి లీకేజి ద్వారా షార్ట్ సర్క్యూట్ చేయించి జగన్ హత్యకు ఎవరు ప్లాన్ చేస్తారు? మొన్న 7వ తేదీనే వర్షం పడుతుందని ఎవరికి తెలుసు. హత్యా చేసేందుకు నిజంగానే కుట్ర జరిగిందని అనుకున్నా, అసలు తమ టార్గెటే దేశంలో లేరుకదా? మరి ఇంకెవరిమీద కుట్ర చేస్తారు?

జగన్ హత్యకు ప్లాన్ చేసారనే అనుకున్నా అసెంబ్లీలోనే ఎందుకు చేస్తారు? ఆ కుట్రేదో విదేశాల్లోనే అమలు చేయవచ్చు కదా? రోజా ఆరోపణలు చూస్తుంటే, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నదనే అర్ధమవుతోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హత్యకు ప్రభుత్వమే కుట్ర పన్నితే అందుకు వేదికగా అసెంబ్లీనే ఎందుకు చేసుకుంటారు? అక్కడేమైనా జరిగితే ప్రభుత్వమే కదా ఇబ్బందుల్లో పడేది? ఆమాత్రం ప్రభుత్వంలోని పెద్దలకు తెలీదా? ఈ ప్రశ్నలకు రోజా సమాధానాలు చెబితే బాగుంటుంది?

click me!