ప్రభుత్వమే అబద్దాలు చెబుతుంటే ఎలా ?

First Published Jul 31, 2017, 8:27 AM IST
Highlights
  • 30 ఏళ్ల  సర్వీసు పూర్తయిన ఉద్యోగులను బలవంతంగా విరమణ చేయించేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించిందన్నది వాస్తవం.
  • అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ముసాయిదా అయితే సిద్ధమైందన్న విషయం లీకైంది.
  • అక్కడి నుండి ఉద్యోగులు ప్రభుత్వాన్ని అమ్మనాబూతులు అందుకున్నారు.

ప్రభుత్వమే అబద్దాలు చెబితుంటే ఎలా?  30 ఏళ్ల  సర్వీసు పూర్తయిన ఉద్యోగులను బలవంతంగా విరమణ చేయించేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించిందన్నది వాస్తవం. అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ముసాయిదా అయితే సిద్ధమైందన్న విషయం లీకైంది. అక్కడి నుండి ఉద్యోగులు ప్రభుత్వాన్ని అమ్మనాబూతులు అందుకున్నారు. దాంతో ప్రభుత్వం షాకైంది. ఎంతో గోప్యంగా ఉంచిన విషయం బయటకు పొక్కటంతో ఉద్యోగులకు ఏం సమాధానం చెప్పాలో ప్రభుత్వానికి అర్ధం కాలేదు. దాంతో జీవోలు సిద్ధమవ్వటం అబద్దమంటూ బొంకటం ప్రారంభించారు.

ముఖ్యమంత్రులు, మంత్రులు ఇలా అందరూ ఎదురుదాడి మొదలుపెట్టారు. నిజానికి ఉద్యోగులను బలవంతంగా ఉధ్వాసనపై ముసాయిదా ఫైలు సిద్ధమైన మాట వాస్తవం. ఫైనాన్స్, లీగల్, సాధారణ పరిపాలనా శాఖల ఉన్నతాధికారులు ఆమోదించారు. ఈ విషయాన్ని సాక్షి లో ముసాయిదాలతో సహా ప్రింట్ అవ్వటంతో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. శనివారం మొదలైన ప్రచారాన్ని తప్పుపడుతూ సిఎం నుండి మంత్రుల వరకూ వరసపెట్టి ఖండించిపాడేసారు. అయితే సోమవారం నాడు ముసాయిదాలతో ప్రచురితమవ్వటంతో ఏం చెప్పాలో ప్రభుత్వ పెద్దలకు అర్ధం కాలేదు.  ముసాయిదా సిద్దమైన విషయాన్ని చివరకు ఆర్ధికశాఖ మంత్రి యనమల అంగీకరించారు. మరి చంద్రబాబు ఏమంటారో చూడాలి.

click me!