చంద్రబాబుకు ఎవరూ అపాయిట్మెంట్ ఇవ్వలేదా ?

First Published Dec 4, 2017, 8:49 AM IST
Highlights
  • కేంద్రంలో ముఖ్యుల అపాయిట్మెంట్ ఎవరిది కూడా చంద్రబాబుకు దక్కలేదా ?

కేంద్రంలో ముఖ్యుల అపాయిట్మెంట్ ఎవరిది కూడా చంద్రబాబుకు దక్కలేదా ? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కావాలనే చంద్రబాబును కేంద్రంలోని పెద్దలందరూ దూరంగా పెట్టినట్లు స్పష్టమవుతోంది. పోలవరం పనుల జాప్యంలో తమను దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించిన కేంద్రంలోని పెద్దలు చంద్రబాబును కలవటానికి ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది.

పోలవరంపై తాజాగా మొదలైన వివాదం అందరికీ తెలిసిందే. పోలవరం పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఇటీవలే ఓ టెండర్ నోటిఫికేష్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో తప్పులున్నాయంటూ నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపేయమని కేంద్రం ఆదేశించింది. అంతర్జాతీయ టెండర్లకు 45 రోజులు గడువు ఇవ్వాల్సుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 18 రోజులే గడువిచ్చింది. దాన్నే కేంద్రం తప్పుపట్టింది. అయితే, కేంద్రం ఆదేశాలను చంద్రబాబు వక్రీకరించారు. పోలవరం పనులు జరగకుండా కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే ఇచ్చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో జనాలు కూడా పోలవరం పనులకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందనే అనుకున్నారు.

అయితే, జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న కేంద్రం తానిచ్చిన ఆదేశాల కాపీలను రాష్ట్ర నేతలకు పంపించింది. అది చూసిన భాజపా నేతలు చంద్రబాబుపై ఎదరుదాడి చేయటంతో మొత్తం వ్యవహరమంతా బయటకు వచ్చింది. అదే సమయంలో వైసిపి అధ్యక్షుడు, నేతలు కూడా చంద్రబాబుపై ఎదురుదాడి మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. వెంటనే పోలవరం వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలుస్తానని చంద్రబాబు ప్రకటించారు.

అందులో భాగంగానే సోమవారం తెల్లవారుజామును ధక్షిణ కొరియాకు బయలుదేరిన చంద్రబాబు అంతుకుముందు ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలిసేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదని సమాచారం. దాంతో చంద్రబాబు చేసేదిలేక కొరియాకు వెళ్ళిపోయారు. గడచిన ఏడాదినర్నగా చంద్రబాబును కలవటాని నరేంద్రమోడి ఇష్టపడని సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మొదలైన ఈ పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయో చూడాలి.  

click me!