కేసుల నుండి రక్షణకే ఎంఎల్సీ పదవా?

First Published Jun 10, 2017, 8:59 AM IST
Highlights

పోలీసులు ఎప్పుడైతే దీపక్ ను అదుపులోకి తీసుకున్నారో వెంటనే జెసి సోదరులు రంగంలోకి దిగారు. దీపక్ అరెస్టు కాకుండా అడ్డుకోవాలని వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట.

కబ్జాలు, అక్రమ దందాల వల్ల తలెత్తే సమస్యలను నుండి తనను తాను రక్షించుకునేందుకే దీపక్ రెడ్డి ఎంఎల్సీ తీసుకున్నారట? ఇది ఎవరో చెప్పింది కాదు. స్వయంగా భారతీయ జనతా పార్టీ నేతలే చెబుతున్నారు. కాబట్టి నిజమనే నమ్మాల్సి వస్తోంది. దానికి తోడు క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులు కూడా భాజపా నేతల మాటలనే బలపరుస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన టిడిపి నేత దీపక్ రెడ్డి నేపధ్యం మొదటి నుండి వివాదాస్పదమే. కాకపోతే ఆయనుకున్న రాజకీయ నేపధ్యం వల్లే నెట్టుకొస్తున్నారు.

జెసి సోదరులుగా పాపులరైన అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి మేనల్లుడు, తాడిప్రతి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడు కావటమే దీపక్ రెడ్డికున్న అర్హత. ముఖ్యంగా దీపక్ దృష్టి అంతా భూముల ఆక్రమణల చుట్టూనే సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు హైదరాబాద్ రాజధాని కాబట్టి సహజంగానే ఆయన లక్ష్యమంతా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే సాగింది.

సరే, తాజాగా దీపక్ పై వస్తున్న ఆరోపణలు, అరెస్టు అందరికీ తెలిసినవే. ఇదే విషయమై భాజపా నేతలు మాట్లాడుతూ, తాను చేస్తున్న అక్రమాల నుండి రక్షణ పొందేందుకే చంద్రబాబునాయుడుపై ఒత్తిడి పెట్టి మరీ దీపక్ ఎంఎల్సీ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒక ఎంపి, మరో ఎంఎల్ఏ ఉన్న ఇంట్లో మళ్లీ ఎంఎల్సీ పదవి ఇవ్వటమంటే మామూలు విషయం కాదు కదా? దీపక్ కోసమని, జెసి సోదరులు చంద్రబాబుపై బాగా ఒత్తిడి పెట్టారని భాజపా అంటోంది. అయితే, ఎంఎల్సీ ఆక్రమణలు, భూ దందాలన్నీ తెలంగాణాలోనే ఉన్నాయి కాబట్టి కేసుల్లో తగులుకుని అరెస్టయ్యాడు.

రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారమేంటంటే, పోలీసులు ఎప్పుడైతే దీపక్ ను అదుపులోకి తీసుకున్నారో వెంటనే జెసి సోదరులు రంగంలోకి దిగారు. దీపక్ అరెస్టు కాకుండా అడ్డుకోవాలని వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట. ఈ కేసులో జోక్యం చేసుకోవటానికి చంద్రబాబు కూడా ఇష్ట పడలేదట. తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలతో కెసిఆర్ కు చెప్పిద్దామని  ఎంత ప్రయత్నంచినా ఫలితం కనబడలేదట.

click me!